iDreamPost

మహిళా ఎమ్మెల్యేతో బీజెపీ ఎంపీ అసభ్య ప్రవర్తన.. ఆమెపై చేతులేస్తూ..

మహిళా ఎమ్మెల్యేతో బీజెపీ ఎంపీ అసభ్య ప్రవర్తన.. ఆమెపై చేతులేస్తూ..

ప్రజలచే ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు..బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజల తరుఫున తమ గళాన్ని వినిపించాలి. వారికి జవాబుదారీతనంగా ఉండాలి. కానీ కొంత మంది అమాత్యులు మాత్రం.. చీకట్లో చేయాల్సిన వ్యవహారాలను నడి బజార్లో చేస్తూ వార్తల్లో నిలుస్తారు. అందరూ చూస్తుండగానే..తోటి మహిళా ప్రజా ప్రతినిధి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వైరల్ అయ్యారు బీజెపీ ఎంపీ ఒకరు. తాము ఉన్నది ఓ బహిరంగ సభలో అన్న విషయం కూడా మర్చిపోయిన ఆ ఎంపీ.. ఏకంగా మహిళా ఎమ్మెల్యేపై చేతులు వేయడంతో పాటు అసభ్యకరమైన రీతిలో తాకుతూ కెమెరా కంటికి చిక్కాడు. చివరకు ఆ ఎమ్మెల్యే ఈసడించుకోవడంతో కాస్త వెనక్కు తగ్గాడు. దీనిపై కాంగ్రెస్ నేతలు విరుచుకు పడుతున్నారు.

ఈ ఘటన ఉత్తర పద్రేశ్‌లో జరిగింది. సెప్టెంబర్25వ తేదీన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా అలీగఢ్ లోని శ్రీరామ్ బాంక్వెట్ హాలులో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కోల్ నియోజక వర్గ ఎమ్మెల్యే అనిల్ షరాషర్. ఈ కార్యక్రమానికి యుపీ బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక మేయర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అలీగఢ్ ఎంపీ సతీష్ గౌతమ్, మహిళా ఎమ్మెల్యే ముక్తా రాజా పక్క పక్కనే కూర్చున్నారు. ఈ సమయంలో సతీష్.. ముక్తాను అనుచితంగా చేతులు తాకుతూ.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. చేతుల మీద నుండి భుజంపైన చేతులు వేసి, ఆమె మీద పడి వాలిపోయే ప్రయత్నం చేయగా.. ముక్తా చిరాకు పడ్డారు. ఇది గ్రహించిన ఆయన వెంటనే ఆమెను వదిలేశారు.

సభలో అందరూ ఉండగానే మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచితంగా ప్రవర్తించడం.. కొంత మంది ఫోన్లలో వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో ఉంచిన యుపీ కాంగ్రెస్.. సదరు ఎంపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అలీగఢ్ ఎంపీ సతీష్.. కార్యక్రమం మధ్యలో ఎమ్మెల్యే ముక్తా రాజాతో బహిరంగంగా సరసాలాడుతున్నారని, అతడి చర్యతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని పేర్కొంది. ఎంపీలే ఇలా ఉన్నారంటే మిగిలిన నేతలు, కార్యకర్తలు ఎలా ఉంటారో అంటూ ప్రశ్నించింది. బహిరంగంగా ఓ మహిళా ఎమ్మెల్యే వేధింపులకు గురౌతుంటే.. ఇక సామాన్యులు, బాలికల పరిస్థితి ఏంటనీ ఏకరువు పెట్టింది కాంగ్రెస్.