iDreamPost

బాక్సాఫీస్ పద్మవ్యూహంలో పృథ్విరాజ్

బాక్సాఫీస్ పద్మవ్యూహంలో పృథ్విరాజ్

అక్షయ్ కుమార్ హీరోగా యష్ రాజ్ సంస్థ తమ యాభైయ్యవ వార్షికోత్సవ కానుకగా భారీ ఎత్తున నిర్మించిన పృథ్విరాజ్ వచ్చే నెల జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాలీవుడ్ దీని మీద చాలా ఆశలే పెట్టుకుంది. తమకూ బాహుబలి లాంటి ఒక విజువల్ క్లాసిక్ ఉండాలని అక్కడ ఎందరో ప్రయత్నించారు. కానీ అవేవి వర్కౌట్ కాలేదు. ఇప్పుడీ మూవీ మీద మాత్రం గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇందాకే ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. సోషల్ మీడియాలో దీని గురించిన చర్చ మొదలైపోయింది. అక్షయ్ కుమార్ కు ఇటీవలే బచ్చన్ పాండే రూపంలో పెద్ద డిజాస్టర్ దక్కింది. దాని గాయం పృథ్విరాజ్ మాన్పుతాడని ఫ్యాన్స్ నమ్మకం.

విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ ప్రతి ఫ్రేమ్ లోనూ చూడొచ్చు. క్యాస్టింగ్ విషయంలో కాంప్రోమైజ్ కాలేదు. సంజయ్ దత్, సోనూ సూద్ లాంటి తారాగణం ఉంది. పృథ్విరాజ్ చౌహన్ ఎంత గొప్ప పోరాట యోధుడే అయినప్పటికీ ఈ సినిమాలో కూడా వార్ డ్రామాని రెగ్యులర్ టెంప్లేట్ లో నడిపించినట్టు కనిపిస్తోంది. మణికర్ణిక, పానీపట్ లాంటివి గుర్తొస్తున్నాయి. ఒకవేళ అదే స్టైల్ లో వెళ్తే కష్టం కానీ రాజమౌళి తరహాలో ఎమోషన్ ని బ్యాలన్స్ చేస్తూ గ్రాఫిక్స్ ని వాడుకుంటే మాత్రం పండగే. డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన పృథ్వి రాజ్ లో 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా పరిచయం కానుండటం విశేషం.

సో పృథ్విరాజ్ బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేయబోతున్నాడో చూడాలి. కానీ ఆ రోజు పోటీ చాలా తీవ్రంగా ఉంది. అడవి శేష్ మేజర్ ప్యాన్ ఇండియా లెవెల్ లో అదే డేట్ ని లాక్ చేసుకుంది. ఇప్పటికే ట్రైలర్ కు ముంబై మీడియా ప్రశంసలు దక్కాయి. మరోవైపు కమల్ హాసన్ విజయ్ సేతుపతి ఫహద్ ఫాసిల్ ల విక్రమ్ కూడా అన్ని భాషల్లో 3నే రాబోతోంది. అంటే ట్రయాంగిల్ పోటీ అన్న మాట. ఇదే జరిగితే సౌత్ లో పృథ్విరాజ్ కు దెబ్బ పడుతుంది. ఒకవేళ ఇదే తేడా కొడితే మిగిలిన రెండు వసూళ్లు లాగేస్తాయి. యష్ బ్యానర్ అనే పాజిటివ్ ఫ్యాక్టర్ తో పాటు హిందూ సెంటిమెంట్ దట్టించిన పృథ్విరాజ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి