iDreamPost

వందల కోట్లు ఉన్నా.. సెకండ్ హ్యాండ్ బట్టలు కొన్న స్టార్ హీరో కొడుకు!

Akshay Kumar: హీరోలు అనగానే ఖరీదైన వాచ్ లు, ఖరీదైన కార్లు వాడుతుంటారు. కొందరు హీరోలు మాత్రం తమ వద్ద కోట్ల ఆస్తులు ఉన్నా సరే.. సాదాసీదా జీవితమే గడుపుతుంటారు. ఓ స్టార్ హీరో కొడుకు కూడా తన తండ్రి కోట్లు సంపాదిస్తున్నా సరే.. తాను మాత్రం సెకండ్ హ్యాండ్ బట్టలే ఉపయోగిస్తున్నాడు.

Akshay Kumar: హీరోలు అనగానే ఖరీదైన వాచ్ లు, ఖరీదైన కార్లు వాడుతుంటారు. కొందరు హీరోలు మాత్రం తమ వద్ద కోట్ల ఆస్తులు ఉన్నా సరే.. సాదాసీదా జీవితమే గడుపుతుంటారు. ఓ స్టార్ హీరో కొడుకు కూడా తన తండ్రి కోట్లు సంపాదిస్తున్నా సరే.. తాను మాత్రం సెకండ్ హ్యాండ్ బట్టలే ఉపయోగిస్తున్నాడు.

వందల కోట్లు ఉన్నా.. సెకండ్ హ్యాండ్ బట్టలు కొన్న స్టార్ హీరో కొడుకు!

సాధారణంగా సెలబ్రిటీల పిల్లల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు ఏది అనుకుంటే.. అది క్షణాల్లో వారి దగ్గరకు వస్తాయి.  ఇంకా స్టార్ హీరోల పిల్లల గురించి అయితే చెప్పనక్కర్లేదు. వారికి కూడా సెలబ్రిటీల స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఇక వారు వినియోగించే వస్తువులన్నీ చాలా ఖరీదుగానే ఉంటాయి. అయితే కొందరు హీరోలు మాత్రం తమ పిల్లలను అతిసాధారణగా పెంచుతుతారు. అలానే సెలబ్రిటీల కొందరు పిల్లలు కూడా ఎంత పెద్ద స్థితిలో ఉన్న కూడా సామాన్య పిల్లల బతికేస్తుంటారు. అలానే తాజాగా వందల కోట్ల ఆస్తులు ఉన్న ఓ స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలే వాడుతున్నాడట. మరి.. ఆ స్టార్ హీరో ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

సినీ, రాజకీయ ప్రముఖులకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినిమా హీరోలు అనగానే ఖరీదైన వాచ్ లు, ఖరీదైన కార్లు వాడుతుంటారు. కొందరు హీరోలు మాత్రం తమ వద్ద కోట్ల ఆస్తులు ఉన్నా సరే.. సాదాసీదా జీవితమే గడుపుతుంటారు. అలానే స్టార్ హీరోల పిల్లలు అయితే వీరికి పూర్తి భిన్నంగా ఉంటారు. కొందరి పిల్లలైతే చెడు వ్యసనాలకు బానిసై రకరకాల పనులు చేస్తూ మీడియా, పోలీసులకు చిక్కిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అయితే వీరందరికీ భిన్నంగా ఓ స్టార్ హీరో కొడుకు మాత్రం తన తండ్రి కోట్లు సంపాదిస్తున్నా సరే.. తాను మాత్రం సెకండ్ హ్యాండ్ బట్టలే ఉపయోగిస్తున్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించాడు. అక్షయ్ కుమార్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. రోబో 2.0తో తెలుగు ప్రేక్షకులను అక్షయ్ కుమార్ అలరించారు. ప్రస్తుతం కొన్ని సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక తరచూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నే అక్షయ్ కుమార్ తన ఫ్యామిలికీ సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటారు. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్టింగ్ చేస్తున్న ఓ టాక్ షోలో కూడా అక్షయ్ కుమార్ పాల్గొన్నాడు.

Star hero's son who bought second hand clothes 01

ఈ క్రమంలోనే తన కొడుకు ఆరవ్ గురించి ఎవరికీ తెలియని కొత్త విషయాన్ని వెల్లడించారు. తాను, తన భార్య ట్వింకిల్ కలిసి ఆరవ్ ని చాలా పద్దతిగా పెంచామని అక్షయ్  తెలిపారు. చాలా సాధారణ పిల్లల మాదిరిగానే తమ కొడుకును పెంచామని తెలిపాడు. తనకి ఏం నచ్చితే అది చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పుకొచ్చాడు. తాను 14 ఏళ్లకే ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే.. ఆరవ్ 15 ఏళ్లకే చదువుకోవడానికి లండన్ వెళ్లాడని అక్షయ్ చెప్పుకొచ్చాడు. ఇక తన కుమారుడు ఆరవ్.. తన పనులను తానే స్వయంగా చేసుకుంటాడని.. స్టార్ హీరో కొడుకును అన్నట్లు ఎప్పుడూ ప్రవర్తించడని షోలో వెల్లడించారు.

ఆరవ్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే.. వాటిని వృథా చేయకుండా తెలిపాడు. ‘థ్రిప్టీ’ అనే సెకండ్ హ్యాండిల్ బట్టలమ్మే షాపుకి వెళ్లి తనకి కావాల్సినవి వాటిని కొంటాడని అక్షయ్ కుమార్ అన్నారు. డబ్బు విలువ తెలిసిన వ్యక్తిగా, మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగిన వాడిలా ఎంతో సాధారణంగా అరవ్ ఉంటాడని అక్షయ్ చెప్పుకొచ్చారు. ఓ స్టార్ హీరో కుమారుడు ఇంత సాధారణం జీవితం గడుపుతున్నాడని తెలిసి..నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి