iDreamPost

Akkineni Akhil: షాకింగ్ లుక్ లో అఖిల్.. చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు! వీడియో వైరల్..

అక్కినేని అఖిల్ లేటెస్ట్ లుక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ లుక్ లో అఖిల్ అస్సలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లుక్ ను మీరూ చూసేయండి.

అక్కినేని అఖిల్ లేటెస్ట్ లుక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ లుక్ లో అఖిల్ అస్సలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లుక్ ను మీరూ చూసేయండి.

Akkineni Akhil: షాకింగ్ లుక్ లో అఖిల్.. చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు! వీడియో వైరల్..

అక్కినేని అఖిల్.. నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే గుర్తింపు అయితే వచ్చింది గానీ, అఖిల్ కు సాలిడ్ హిట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. వివి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో లాంచ్ అయినప్పటికీ.. సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఓ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు ఈ అక్కినేని హీరో. ఈ క్రమంలోనే అఖిల్ లేటెస్ట్ లుక్ అభిమానులను షాక్ కు గురిచేసింది. ఆ లుక్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ హిట్ కోసం ఎదరుచూసే హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకడు. అఖిల్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మాత్రమే హిట్ టాక్ ను తెచ్చుకుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కుతాడని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’ భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అఖిల్ నుంచి సాలిడ్ హిట్ మూవీ కోసం వారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే తన నెక్ట్స్ సినిమాతో అభిమానుల కోరికను నెరవేర్చాలని ఆరాటపడుతున్నాడు అఖిల్. అందుకోసం తన గెటప్ ను పూర్తిగా మార్చినట్లు తెలుస్తోంది. తాజాగా అఖిల్ కు సంబంధించిన లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో.. స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఈ మేకోవర్ మెుత్తం తన నెక్ట్స్ మూవీ కోసమే అని టాక్. అయితే అఖిల్ నెక్ట్స్ మూవీ గురించి ఇంకా అప్డేట్ రాలేదు. కానీ ఈ రా లుక్ లో అఖిల్ హాలీవుడ్ హీరోలా ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అఖిల్ లేటెస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి