iDreamPost
android-app
ios-app

ఘోర ఓటమి తర్వాత రోహిత్‌తో మాట్లాడిన ఆకాశ్‌ అంబానీ! బ్యాక్‌ టూ కెప్టెన్సీ?

  • Published Mar 28, 2024 | 12:26 PM Updated Updated Mar 28, 2024 | 12:26 PM

Rohit Sharma, MI vs SRH, IPL 2024: ఐపీఎల్‌ 2024లో రెండు వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ కళ్లు తెరుచుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్‌ శర్మను తిరిగి ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేలా సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, MI vs SRH, IPL 2024: ఐపీఎల్‌ 2024లో రెండు వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ కళ్లు తెరుచుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్‌ శర్మను తిరిగి ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేలా సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 28, 2024 | 12:26 PMUpdated Mar 28, 2024 | 12:26 PM
ఘోర ఓటమి తర్వాత రోహిత్‌తో మాట్లాడిన ఆకాశ్‌ అంబానీ! బ్యాక్‌ టూ కెప్టెన్సీ?

ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్‌ వరుసగా రెండో ఓటమిని మూటగట్టకుంది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై.. బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ఘోర ఓటమిని చవిచూసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవిని ఎరుగని విధంగా పరుగులు సమర్పించుకుంది ముంబై ఇండియన్స్‌. ముంబై బౌలర్లను చీల్చిచెండాడిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. కొత్త చరిత్ర లిఖిస్తూ.. ఐపీఎల్‌ చరిత్రలోనే కాదు.. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే హైయొస్ట్‌ స్కోర్‌ను నమోదు చేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 277 పరుగులు అతి భారీ స్కోర్‌ చేసింది. ఈ స్కోర్‌ చూడగానే ముంబై సగం చచ్చిపోయింది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో మయాంక్‌ అగర్వాల్‌ 11 రన్స్‌ మాత్రమే చేసిన అవుటైనా.. ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 62, అభిషేక్‌ శర్మ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 63, మార్కరమ్‌ 28 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులు.. ఇక విధ్వంస వీరుడు హెన్రిచ్‌ క్లాసెన్‌ 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సులతో 80 రన్స్‌ చేసి.. ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు.

ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్‌ కూడా బాగానే బ్యాటింగ్‌ చేసినా.. అది ఎస్‌ఆర్‌హెచ్‌ సృష్టించిన సునామీ ముందు సరిపోలేదు. ముంబై 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి 31 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. రోహిత్‌ శర్మ 12 బంతుల్లో ఒక ఫోర్‌, 3 సిక్సులతో 26, ఇషాన్‌ కిషన్‌ 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 34, నమన్‌ ధీర్‌ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30, తిలక్‌ వర్మ 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 64, టిమ్‌ డేవిడ్‌ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి.. రాణించినా.. ముంబైని గెలిపించలేకపోయారు. అయితే.. ఈ దారుణ ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ కెప్టెన్సీ విషయంలో పునరాలోచనలో పడినట్లు సమాచారం.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్‌ పాండ్యా టీమ్‌ని నడిపిస్తున్న తీరు, అతని ప్రవర్తనపై ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒత్తిడిని హ్యాండిల్‌ చేయలేకపోవడం, బౌలింగ్‌ మార్పులు, బ్యాడ్‌ ఫీల్డ్‌ సెట్‌తో పాండ్యా తనపై ముంబై యాజమాన్యం పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో ఆకాశ్‌ అంబానీ మాట్లాడినట్లు తెలుస్తోంది. తిరిగి జట్టు పగ్గాలు అందుకోవాలని కోరినట్లు సమాచారం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత ఆకాశ్‌ అంబానీ, రోహిత్‌తో చర్చలు జరిపిన దృష్ట్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముంబై ఫ్యాన్స్‌ కూడా ముంబైకి రోహిత్‌ శర్మనే కెప్టెన్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. మరి రోహిత్‌ తిరిగి ముంబై కెప్టెన్‌గా వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.