iDreamPost
android-app
ios-app

AI మాయ.. అక్కినేని హీరో లుక్ అదిరిపోయింది

  • Published Jan 13, 2024 | 3:31 PM Updated Updated Jan 13, 2024 | 3:34 PM

సోషల్ మీడియాలో ఏదైనా ఒకటి రెండు వీడియోలు, ఫోటోలు వైరల్ అయితే.. వాటిని కాస్త ట్రెండ్ గా మార్చేస్తారు నెటిజన్లు. పాత తెలుగు హీరోల ఫోటోలను ఏఐ ద్వారా కొత్తగా మార్చడమే.. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.

సోషల్ మీడియాలో ఏదైనా ఒకటి రెండు వీడియోలు, ఫోటోలు వైరల్ అయితే.. వాటిని కాస్త ట్రెండ్ గా మార్చేస్తారు నెటిజన్లు. పాత తెలుగు హీరోల ఫోటోలను ఏఐ ద్వారా కొత్తగా మార్చడమే.. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.

  • Published Jan 13, 2024 | 3:31 PMUpdated Jan 13, 2024 | 3:34 PM
AI మాయ.. అక్కినేని హీరో  లుక్ అదిరిపోయింది

నిన్న శోభన్ బాబు, ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు ఈ జనరేషన్ లో కనుక వీళ్ళు ఉండి ఉంటే.. మనకు ఎలా కనిపించేవారో సేమ్ అలానే ఇప్పుడు వీరి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఎప్పటికపుడు అప్ డేట్ అవుతున్న టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు ప్రజలు. టెక్నాలిజీ పుణ్యమా అని ఉన్నవి లేనట్టుగా.. లేనివి ఉన్నట్టుగా క్రియేట్ చేయడం బాగా ట్రెండ్ అయిపోయింది. ఈ అప్ డేట్ అవుతున్న టెక్నాలిజీని అందరికి ఉపయోగ పడేలా వాడుకునే వారు ఉన్నారు. దీనిని మిస్ యూస్ చేసుకునే వారు ఉన్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం.. పాత తెలుగు లెజెండరీ హీరోల చిత్రాలు ఏఐ మాయతో మార్చి.. వాటిని ట్రెండ్ చేస్తున్నారు. తాజగా నట సామ్రాట్ అక్కినేని ఫోటోలతో ఏఐ అద్భుతాన్ని సృష్టించింది.

ఇటీవల ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సోగ్గాడు శోభన్ బాబు ఫోటోలను వైరల్ చేశారు. ఇక ఇప్పుడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరావు ఫోటోలను మార్చి వాటిని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం పాత హీరోల ఫోటోలను ఏఐ ద్వారా కొత్తగా మార్చి వైరల్ చేయడం కొత్త ట్రెండ్ గా మారిపోయింది. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఫోటోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమను కొన్ని సంవత్సరాల పాటు ఏలిన హీరోలలో.. అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయన తన అద్భుతమైన నటనతో ఆనాటి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తన సినీ జీవితంలో ఆయన చూడాని సన్మానాలు లేవు.. అందుకోని సత్కారాలు లేవు. కొన్ని వందల సినిమాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించి.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని.. ప్రేక్షకులలో చెరగని ముద్రను ఏర్పాటు చేసుకుని.. నట సామ్రాట్ అనే బిరుదును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫోటోలను గమనిస్తే.. ఆ ఫోటోలలో అక్కినేని ఎంతో అందంగా కనిపిస్తున్నారు.

ఏఐ సృష్టించిన ఆ వ్యక్తి కనుక ఇప్పుడు నిజంగానే ఉండి ఉంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు భారీ పోటీగా నిలిచేవారేమో. కాగా, అక్కినేని నాగేశ్వరరావు చివరిగా తన వారసులతో కలిసి మనం చిత్రంలో కనిపించారు. తన జీవితం చివరి వరకు కూడా ఎంతో ఉన్నంతంగా జీవించి.. ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరావు. అక్కినేని వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన వారసులు కూడా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన నట సామ్రాట్ ఫోటోలు.. దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేయగా.. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి, ఈ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbet