iDreamPost

నిన్న నాగబాబు నేడు ప్రకాష్ రాజ్ గుడ్ బై

నిన్న నాగబాబు నేడు ప్రకాష్ రాజ్ గుడ్ బై

నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్ లో మంచు విష్ణు గెలవడం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ మోస్ట్ డిబేటబుల్ హాట్ టాపిక్ గా మారింది. రాత్రి విజేతను ప్రకటించిన కొద్దిసమయానికే నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆల్రెడీ కలకలం రేపింది. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించి మాతో ఉన్న 21 ఏళ్ళ అనుబంధాన్ని మీడియా సాక్షిగా తెంచుకోవడం కొత్త పరిణామం. ఆత్మగౌరవం పేరిట తన స్థానికతను పదే పదే ప్రశ్నించి దాన్నే ఎజెండాగా మార్చుకుని బైలాస్ మార్చబోతున్నామని విష్ణు వర్గం హామీలు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పిన ప్రకాష్ రాజ్ అసలు రాజకీయ నాయకులకు ఏ మాత్రం సంబంధం లేని మా వ్యవహారం గురించి బండి సంజయ్ చేసిన ట్వీట్ ని ప్రస్తావించడం విశేషం. తనకు సపోర్ట్ ఇచ్చి ప్యానెల్ లో నిలబడిన వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పిన ప్రకాష్ రాజ్ ఇకపై నటుడిగా కొనసాగుతానని, ఒకవేళ మా సభ్యత్వం లేనివాళ్లకు అవకాశం ఇవ్వమని కనక తేల్చితే తాను చేయగలిగింది ఏమి లేదని స్పష్టం చేశారు. స్టూడియోలకు రానివ్వరా, షూటింగులకు నో ఎంట్రీ అంటారా అంటూ రివర్స్ లో ప్రశ్నించారు. ఈయన రాజీనామా చేయడం ఊహించిందే అయినా ఇంత త్వరగా మాత్రం అనుకోనిది

మా రచ్చ నిన్నటితో అయిపోయిందనుకుంటున్న తరుణంలో ఈ రాజీనామాలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇవి వీళ్లిద్దరితో ఆగుతాయా లేక మరికొందరు ఇదే బాట పడతారా అంటే ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఔననే సమాధానం వినిపిస్తోంది. కోట శ్రీనివాసరావు పట్ల అభ్యంతరకర పదాలు నాగబాబు వాడటం పట్ల మీడియా అడిగినప్పుడు అది వ్యక్తిగతమంటూ ప్రకాష్ రాజ్ దాటవేయడం గమనార్హం. మొత్తానికి ఎన్నికల ముందు ఒక గొడవ, కౌంటింగ్ లో మరో రచ్చ, ఇప్పుడు అంతా అయిపోయాక కూడా ఇంకో కొత్త ఇష్యూ. వీటికి మంచు విష్ణు స్పందన, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన వాళ్ళ రియాక్షన్ ఇంకా చాలానే రాబోతున్నాయి

Also Read : అప్పుడే చిన్నితెరపై లవ్ స్టోరీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి