iDreamPost

సొంత అన్నకి పవన్ హ్యాండ్? అనకాపల్లి నుంచి నాగబాబును తప్పించారా?

Pawan, Nagababu: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరిగింది. ఆ మాటలను నిజం చేస్తూనే నాగబాబు అనకాపల్లిలో పర్యటన చేశారు. అయితే తాజాగా అక్కడి నుంచి నాగబాబును తప్పించారనే టాక్ పొలిటకల్ సర్కిల్ లో వినిపిస్తోంది.

Pawan, Nagababu: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరిగింది. ఆ మాటలను నిజం చేస్తూనే నాగబాబు అనకాపల్లిలో పర్యటన చేశారు. అయితే తాజాగా అక్కడి నుంచి నాగబాబును తప్పించారనే టాక్ పొలిటకల్ సర్కిల్ లో వినిపిస్తోంది.

సొంత అన్నకి పవన్ హ్యాండ్? అనకాపల్లి నుంచి నాగబాబును తప్పించారా?

త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ, జనసేన కూటమిగా ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే 118 స్థానాలకు ఉమ్మడి అభ్యర్థులను టీడీపీ, జనసేన కూటమి ప్రకటించింది.  జనసేనాకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక సీట్లు ప్రకటించిన సమయంలో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తాడనే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లే..ఆయన అనకాపల్లిలో పర్యటన చేసి.. సమావేశాలు నిర్వహించారు. అయితే తాజాగా ఓ వార్త పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. నాగబాబును ఆ స్థానం నుంచి తప్పించారనే వార్తలు వినిపిస్తోన్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్, తరువాత ఆ పార్టీలో కీలకమైన నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు. ఇక ఇటీవల విడుదల చేసిన జాబితాల్లో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే తాను పోటీ చేస్తున్న స్థానంపై క్లారిటీ ఇవ్వలేదు. మొత్తంగా అసెంబ్లీ స్థానాల విషయం ప్రక్కన పెడితే.. పార్లమెంట్ స్థానాల విషయంలో ఓ వార్త నడుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 3 పార్లమెంట్ స్థానాల నుంచి పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేయనుంది. అందులో మంచిలీ పట్నం, అనకాపల్లి, కాకినాడ అని తెలుస్తోంది. ఇందులో మంచిలీపట్నం నుంచి ఇటీవలే వైసీపీ నుంచి జనసేనాలో చేరిన వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. అలానే కాకినాడ నుంచి మరో కీలక నేత పోటీ చేయనున్నారు.

ఇక అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారనే చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఆ మాటలను నిజం చేస్తూ.. కొంతకాలం క్రితం నాగబాబు అనకపల్లిలో పర్యటించారు. అయితే ఇటీవలే ఆయన అనకాపల్లి నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారని సమాచారం. ఆయను అనకాపల్లి నుంచి తప్పించడం అందుకు కారణమని వార్తలు వినిపిస్తోన్నాయి. ఇప్పటి వరకు చంద్రబాబు ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ వంటి పలు స్థానాల్లో తన అభ్యర్థులను తప్పించాడని పలువురు తెలిపారు. అలానే అనకాపల్లి విషయంలో కూడా చంద్రబాబు ఆదేశాలతోనే నాగబాబును తప్పించారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. మొత్తంగా చంద్రబాబు కన్నుసన్నల్లోనే సీట్లు తీసుకోవడం, అభ్యర్థులను ఎంపిక చేయండ పవన్ చేస్తున్నారనే పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు పార్టీనేతలకే హ్యాండ్  ఇచ్చిన పవన్ కల్యాణ్ ఈ సారి ఏకంగా సొంత అన్నకే హ్యాండ్ ఇచ్చాడనే ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో బలంగా వినిపిస్తోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి