iDreamPost
android-app
ios-app

IND vs SA: KL రాహుల్ అరుదైన ఘనత.. 14 ఏళ్ల తర్వాత

  • Published Dec 21, 2023 | 8:01 PM Updated Updated Dec 21, 2023 | 8:41 PM

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

IND vs SA: KL రాహుల్ అరుదైన ఘనత.. 14 ఏళ్ల తర్వాత

ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జరుగుతున్న మూడు వన్డే సిరీస్ ల మ్యాచ్ ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఇక సిరీస్ నిర్ణయాత్మక పోరులో తలపడుతున్నాయి. బోలాండ్ పార్క్ లో జరుగుతున్న ఈ వన్డేలో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఇక మ్యాచ్ లో భారత తాత్కాలిక కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు కేఎల్. 14 సంవత్సరాల క్రితం టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఈ ఘనతను సాధించాడు. ఇప్పుడు ధోని సరసన చేరాడు కేఎల్ రాహుల్. మరి ఆ అరుదైన రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు రాహుల్. ఈ క్రమంలోనే 14 సంవత్సరాల విరామం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్ లో వన్డేల్లో 1000 పరుగులు చేసిన తొలి టీమిండియా వికెట్ కీపర్ గా రాహుల్ నిలిచాడు. కాగా.. ఈ ఫీట్ ను 14 ఏళ్ల క్రితం భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని సాధించాడు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఫీట్ సాధించాడు రాహుల్ భాయ్.

kl rahul creates history

ఇక ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో టీమిండియా నెగ్గగా.. ఆ తర్వాత పోరులో సౌతాఫ్రికా గెలిచింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. కాగా.. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది భారత జట్టు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..  నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. జట్టులో స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ వన్డే కెరీర్ లో తొలి సెంచరీ సాధించాడు. 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో 108 రన్స్ చేశాడు. తిలక్ వర్మ(52), రింకూ సింగ్(38) పరుగులతో రాణించారు. మరి కేఎల్ రాహుల్ సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.