iDreamPost

T20 World Cup: సూపర్‌ 8కు క్వాలిఫై అయిన ఆఫ్ఘానిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ!

  • Published Jun 15, 2024 | 1:12 PMUpdated Jun 15, 2024 | 1:12 PM

సూపర్-8కు క్వాలిఫై అయిన ఆఫ్ఘానిస్థాన్​కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆ టీమ్​ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక మీదట జరిగే మ్యాచుల్లో జట్టు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారు.

సూపర్-8కు క్వాలిఫై అయిన ఆఫ్ఘానిస్థాన్​కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆ టీమ్​ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక మీదట జరిగే మ్యాచుల్లో జట్టు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారు.

  • Published Jun 15, 2024 | 1:12 PMUpdated Jun 15, 2024 | 1:12 PM
T20 World Cup: సూపర్‌ 8కు క్వాలిఫై అయిన ఆఫ్ఘానిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ!

ఆఫ్ఘానిస్థాన్.. ఇప్పుడు ఈ పేరు చెబితేనే అందరూ వణుకుతున్నారు. ఒకప్పుడు క్రికెట్​లో ఈ జట్టును అందరూ పసికూనగా చూసేవారు. ఆ టీమ్ ఆటతీరు కూడా అలాగే ఉండేది. కానీ గత కొన్నేళ్లలో ఆఫ్ఘాన్ గేమ్ పూర్తిగా మారింది. రషీద్ ఖాన్, రెహ్మానుల్లా గుర్బాజ్, ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్ నబీ లాంటి ఆ టీమ్ ప్లేయర్లు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్​ను అందుకున్నారు. దీంతో ఆఫ్ఘాన్​ అదరగొడుతోంది. టెస్ట్ టీమ్ నేషన్​గా ఎదిగింది ఈ ఆసియా జట్టు. అలాగే గత వన్డే వరల్డ్ కప్​-2023లో అద్భుత ఆటతీరుతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక లాంటి హేమాహేమీల్ని ఆ టోర్నీలో మట్టికరిపించింది ఆఫ్ఘాన్. ఆస్ట్రేలియాను కూడా దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఇదే జోరును ప్రస్తుతం జరుగుతున్న పొట్టి కప్పులోనూ కంటిన్యూ చేస్తోంది. హ్యాట్రిక్ విక్టరీస్​తో టీ20 ప్రపంచ కప్-2024 సూపర్-8కు దూసుకెళ్లింది.

టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్​లో పసికూన ఉగాండాను 125 పరుగుల తేడాతో చిత్తు చేసింది ఆఫ్ఘాన్. ఆ తర్వాత మ్యాచ్​లో ఫేవరెట్స్​లో ఒకటైన న్యూజిలాండ్​ను అనూహ్యంగా 84 పరుగుల తేడాతో మట్టికరిపించింది రషీద్ సేన. నిన్న జరిగిన మరో మ్యాచ్​లో పపువా న్యూ గినియాను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘనవిజయాలు సాధించడం, సూపర్-8కు క్వాలిఫై అవడంతో ఆఫ్ఘాన్ అభిమానుల సంతోషానికి హద్దుల్లేకుండా పోయాయి. తమ టీమ్ అంచనాలకు మించి రాణిస్తుండటంతో వాళ్లు ఆనందం పట్టలేకపోయారు. ఈ తరుణంలో ఆఫ్ఘానిస్థాన్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ విజయాల్లో కీలకంగా మారిన స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్​ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు.

Afghanistan

పొట్టి కప్పులో అదరగొడుతున్న ముజీబ్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తెలిపింది. వరల్డ్ కప్​లోని మిగిలిన మ్యాచ్​లకు ఈ స్పిన్నర్ అందుబాటులో ఉండటం లేదని ఐసీసీ పేర్కొంది. ముజీబ్ ప్లేస్​లో ఓపెనర్ హజ్రతుల్లా బజాయ్ ఆఫ్ఘాన్ మెయిన్ టీమ్​లోకి చేరినట్లు వెల్లడించింది. ఉగాండాతో మ్యాచ్​లో మూడు ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు ముజీబ్. అయితే మధ్య వేలికి గాయమవడంతో మిగిలిన మ్యాచుల్లో అతడి స్థానంలో మరో స్పిన్నర్ నూర్ అహ్మద్ బరిలోకి దిగాడు. ఇంజ్యురీ ఎంతకీ తగ్గకపోవడంతో ముజీబ్​ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఆఫ్ఘాన్ ఆల్రెడీ సూపర్​-8కు చేరుకుంది. రషీద్​కు తోడుగా అతడు ఉంటే బిగ్ మ్యాచెస్​లో ఆఫ్ఘాన్​కు మరింత ప్లస్ అయ్యేది. కానీ కీలక సమయంలో ముజీబ్ దూరమవడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. అతడు లేని లోటును నూర్ ఎంతవరకు తీరుస్తాడోనని ఆందోళన చెందుతున్నారు. మరి.. సూపర్-8కి ముందు ముజీబ్ సేవల్ని కోల్పోవడం ఆఫ్ఘాన్​పై ఎంతమేర ప్రభావం చూపిస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి