iDreamPost

Vikram Mastal: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆదిపురుష్ హనుమాన్ నటుడు! BJP విమర్శలు..

  • Author Soma Sekhar Published - 07:08 PM, Wed - 5 July 23
  • Author Soma Sekhar Published - 07:08 PM, Wed - 5 July 23
Vikram Mastal: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆదిపురుష్ హనుమాన్ నటుడు! BJP విమర్శలు..

సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఈ విషయం ఇప్పటికే రుజువైంది. అప్పటి ఎంజీఆర్ నుంచి ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకు ఇండస్ట్రీలో తమదైన ముద్రవేసి.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరోనటుడు ఇండియన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆదిపురుష్ సినిమాలో హనుమాన్ పాత్ర పోషించిన నటుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. హనుమాన్ పాత్రలో నటించి హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీలో కాకుండా అతడు కాంగ్రెస్ లో చేరడం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ నటుడి నేపథ్యం ఏంటి? అతడు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదిపురుష్.. సినిమా పరంగ విజయం ఏమో కానీ.. వివాదాల పరంగా మాత్రం విజయం సాధించిందనే చెప్పాలి. అంతలా అన్ని వివాదాలు ఈ సినిమాను చుట్టుముట్టాయి. ఇక సినిమాలోని అన్ని పాత్రలు విమర్శలకు గురైనవే. డైరెక్టర్ ఓం రౌత్ కు అసలు రామాయణం తెలుసా? అంటూ కొందరు విమర్శించగా.. అలహాబాద్ హైకోర్ట్ మూవీ మేకర్స్ పై ఆగ్రహాం వ్యక్తం చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ సినిమాలో హనుమాన్ పాత్రలో నటించిన విక్రమ్ మస్తాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ సమక్షంలో కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు.

కాగా.. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అతడి చేరిక మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కు బలం చేకూరుస్తుందని కొందరు చెప్పుకొస్తున్నారు. మాజీ ముఖ్య మంత్రి కమల్ నాథ్ చేసిన అభివృద్ధి పనులే తనను కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేశాయని విక్రమ్ మస్తాల్ వెల్లడించారు. దేశాన్ని అభివృద్ధి చేసేది కాంగ్రెస్సే అని విశ్వసించి ఈ పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. అదీకాక వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక విక్రమ్ మస్తాల్ కాంగ్రెస్ జెండా కప్పుకోవడంపై విమర్శలు గుప్పించారు బీజేపీ పార్టీ నాయకులు. దేశ అభివృద్ధి కాంగ్రెస్ వల్ల కాదని, అది బీజేపీ వల్లే సాధ్యం అని మధ్యప్రదేశ్ కమలం పార్టీ నాయకులు వెల్లడించారు. నిజంగా విక్రమ్ మస్తాల్ భారతదేశ అభివృద్ధి కోరుకునే వాడే అయితే.. అతడు కచ్చితంగా బీజేపీలో చేరి ఉండాల్సిందని వారు సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి