iDreamPost

25 ఎకరాల భూమి కొన్న అదానీ! ఇక ఆ ప్రాంతం అంతా రియల్ ఎస్టేట్ బూమ్ పక్కా!

  • Published Apr 16, 2024 | 7:31 PMUpdated Apr 16, 2024 | 7:31 PM

Gautam Adani: ఆసియాలోనే అత్యంత సంపన్నుల గల వ్యక్తిగా గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అదానీ గ్రూప్ పూణెలోని 25 ఏకరాల భూమిని కొనుగోలు చేసింది. పైగా దీని కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం అందింది. ఇంతకి అదానీ గ్రూప్ అక్కడే ఎందుకు కొన్నారో తెలుసా..?

Gautam Adani: ఆసియాలోనే అత్యంత సంపన్నుల గల వ్యక్తిగా గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అదానీ గ్రూప్ పూణెలోని 25 ఏకరాల భూమిని కొనుగోలు చేసింది. పైగా దీని కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం అందింది. ఇంతకి అదానీ గ్రూప్ అక్కడే ఎందుకు కొన్నారో తెలుసా..?

  • Published Apr 16, 2024 | 7:31 PMUpdated Apr 16, 2024 | 7:31 PM
25 ఎకరాల భూమి కొన్న అదానీ! ఇక ఆ ప్రాంతం అంతా రియల్ ఎస్టేట్ బూమ్ పక్కా!

దేశంలో అత్యంత సంపన్నుల గల వ్యక్తి, అదానీ గ్రూప్ అధినేతగా కొనసాగుతున్న గౌతమ్ అదానీ గురించి అందరికీ తెలిసిందే. ఈయన భారతదేశంలోనే ఒక బిలియనీర్ పారిశ్రామికవేత్త. అయితే గతేడాది నుంచి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గౌతమ్ అదని గురించి చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. ఎందుకంటే.. ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి చేరుకోవడమే కాకుండా.. ఏడాది క్రితం కోల్పోయిన రిచెస్ట్‌ పర్సన్‌ కిరీటాన్ని మళ్లీ సాధించారు. అంతేకాకుండా గౌతమ్ అదానీ ఇప్పుడు ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన హోదాను తిరిగి చేజిక్కించుకున్నారు. అలాగే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో దేశంలోనే అత్యంత రిచ్చేస్ట్ పర్సన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన విషయం కూడా తెలిసిందే. ఇలా వివిధ రకాలుగా గౌతమ్ అదానీ తన వ్యాపార కార్యకలాపాల్లో వేగంగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అదానీ గ్రూపు పూణెలో 25 ఏకరాల భూమిని కొనుగోలు చేసింది. పైగా దీని కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం అందింది. ఇంతకి అదానీ గ్రూప్ అక్కడే ఎందుకు కొన్నారో తెలుసా..?

ఆసియాలోనే అత్యంత సంపన్నుల గల వ్యక్తిగా గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అదానీ గ్రూప్ పూణెలోని వాఘేరే ప్రాంతంలో ఫినోలక్స్ ఇండస్ట్రీస్‌ కంపెనీకి చెందిన 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అయితే దీని కోసం అదానీ గ్రూప్ ఏకంగా రూ. 470 కోట్లు ఖర్చు చేశారు. కాగా, నిజానికి అదానీ గ్రూప్ సంస్థ రియల్ ఎస్టేట్ డెవలపర్ టెర్రా విస్టా కోసం.. అన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం అందింది. ఇక  ఫినోలక్స్ నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న టెర్రా విస్టా అక్కడ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉంది. కనుక  పింబ్రి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫినోలక్స్ సైట్‌ను టెర్రా విస్టా కొనుగోలు చేయడం కోసం.. ఈనెల  ఏప్రిల్ 23న సేల్ డీడ్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇక ఈ స్థలాన్ని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పీవీసీ పైపుల తయారీ కంపెనీకి లీజుకు ఇచ్చింది.

అయితే  గతంలోనే అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్.. అమెరికాకు చెందిన గ్లోబల్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రొవైడర్ ఎడ్జ్ కన్నెక్స్ జాయింట్ వెంచర్‌లోకి  ఎంట్రీ ఇచ్చింది. కాగా, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా దేశంలోని సెంటర్లను నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి 2021 ఫిబ్రవరిలో అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో డేటా సెంటర్‌లను నిర్మించడానికి, నిర్వహించడానికి ఎడ్జ్ కనెక్ట్‌తో 50:50 భాగస్వామ్యంతో బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల అభివృద్ధిని అదానీ కొనసాగిస్తున్నారు. పైగా అదానీ గ్రూప్ చెన్నై, ముంబై,  నోయిడా, విశాఖ, హైదరాబాద్ వంటి నగరాల్లో మార్కెట్‌ ను ప్రారంభించి దేశవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల నెట్‌వర్క్‌ను నిర్మించడంపై దృష్టి సారిస్తోంది.  అయితే ఇవి దేశంలో ఉన్న డేటా సెంటర్లకు  ఉన్న డిమాండ్ ను తీర్చగలవని తెలుస్తోంది.

ఇక ఈ  ఎడ్జ్‌సైట్‌లు అవసరమైనంత సులభంగా స్కేల్ చేయడానికి, పూర్తి స్థాయి డేటా సెంటర్ క్యాంపస్‌లుగా రూపొందించడానికి ప్రారంభించడం జరిగింది. కాగా, అదానీ గ్రూప్ ఫినోలక్స్ నుంచి కొన్న స్థలం మొత్తం వైశాల్యం 25.27 ఎకరాలుగా ఉండగా.. దీనికి స్టాంపు డ్యూటీగా రూ.23.52 కోట్లును చెల్లించారు. అయితే అంతకు ముందు 2022లో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ పూణెలో ఫినోలక్స్ ఇండస్ట్రీస్ నుంచి రూ.328.84 కోట్లకు వాణిజ్య ప్లాట్‌ను కొనుగోలు చేసింది. అలాగే కమర్షియల్ ఫ్లాట్ పూణేలోని పింప్రి వాగరే ప్రాంతంలో ఉండగా.. దానికి లీజు బదిలీ కోసం ఫినోలక్స్ రూ.328.84 కోట్లు పొందిన విషయం తెలిసిందే. మరి, అదానీ గ్రూప్ పూణెలో  25 ఏకరాల భూమిని కొనుగోలు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి