iDreamPost

ప్రియుడ్ని మనువాడిన టాలీవుడ్ హీరోయిన్..

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అమీర్ ఖాన్ కూతురు తన ప్రియుడ్ని మనువాడిన సంగతి విదితమే. అలాగే ఆషికా రంగనాథ్ సోదరి, నటి కూడా తాజాగా పెళ్లి చేసుకుంది. సాయి పల్లవి సోదరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు..

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అమీర్ ఖాన్ కూతురు తన ప్రియుడ్ని మనువాడిన సంగతి విదితమే. అలాగే ఆషికా రంగనాథ్ సోదరి, నటి కూడా తాజాగా పెళ్లి చేసుకుంది. సాయి పల్లవి సోదరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు..

ప్రియుడ్ని మనువాడిన టాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు సెలబ్రిటీల నివాసాల్లో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఈ జనవరిలో వివాహం చేసుకున్న సంగతి విదితమే. అలాగే కన్నడ నుండి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమిగోస్ బ్యూటి ఆషికా రంగనాథ్ ఇంట్లో కూడా భాజా భజంత్రీలు మోగాయి. ఆమె అక్క, నటి అనూష రంగనాథ్ వివాహం కూడా ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫోటోలను కూడా ఆమె షేర్ చేసుకున్న సంగతి విదితమే. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సోదరి పూజా కూడా ప్రేమించిన వ్యక్తిని మనువాడబోతుంది. ఇటీవల ఆమె ఎంగేజ్ మెంట్ జరగ్గా.. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఇప్పుడు ఓ టాలీవుడ్ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కింది. తన ప్రియుడ్ని వివాహం చేసుకుంది. ఈ పెళ్లి తిరువనంతపురంలో జరిగింది. స్వాసిక విజయ్.. ప్రియుడు, నటుడు,మోడల్ ప్రేమ్ జాకబ్‌ను వివాహం చేసుకున్నారు. తన ఫోటోలోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఆ నటి. స్వాసిక తెలుగులో ఎటు చూసినా నువ్వే అనే సినిమా చేసింది. తెలుగులో చేసిన ఏకైక మూవీ ఇదే. ఎక్కువగా తమిళ్ సినిమాలు, సీరియల్స్ కనిపిస్తూ ఉంటుంది ఈ మలయాళ బ్యూటీ. ప్రేమ్-స్వాసిక గతంలో మనం పోలే మాంగల్యం అనే టీవీ సీరియల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పుడు మొదలైన ప్రేమ.. ఇప్పుడు మూడు ముళ్లతో ఒక్కటి అయ్యారు.

సోషల్ మీడియాలో తన ఫోటోలను పంచుకున్న ఆమె ‘ఇద్దరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. మీగడ రంగు షేర్వాణీ కుర్తాలో ప్రేమ్, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ శారీలో మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ ఫోటోలను చూసి ఆమెను శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా, స్నేహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. జనవరి 27న కొచ్చిలోని రిసెప్షన్ వేడుక జరగనుంది.’ప్రభువింటే మక్కల్’, ‘కట్టప్పనయిలే రిత్విక్ రోషన్’, ‘పొరింజు మరియమ్ జోస్’, ‘చతురం’ వంటి సినిమాల్లో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆమె అసలు పేరు పూజా విజయ్.. సినిమాల్లోకి వచ్చాక స్వాసికగా పేరు మార్చుకుంది. ఇప్పుడు ఆమె రెండు సినిమాల్లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Swaswika (@swasikavj)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి