iDreamPost

నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. ఆ ఏడాదంతా చాలా బాధపడ్డాను: నటి స్నేహ

  • Published Apr 18, 2024 | 8:49 AMUpdated Apr 18, 2024 | 8:49 AM

Sneha: హీరోయిన్ స్నేహ తన భర్త గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

Sneha: హీరోయిన్ స్నేహ తన భర్త గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

  • Published Apr 18, 2024 | 8:49 AMUpdated Apr 18, 2024 | 8:49 AM
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. ఆ ఏడాదంతా చాలా బాధపడ్డాను: నటి స్నేహ

అందం, అమాయకత్వం కలబోతల రూపం హీరోయిన్ స్నేహ. చూడగానే అరే మన పక్కింటి అమ్మాయే అనిపిస్తుంది. వెండి తెరపై బాపు బొమ్మలా మెరిసింది. అశ్లీలత, అసభ్యతకు తావు లేని పాత్రలను ఎంచుకుని.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ తరం సౌందర్యగా కీర్తింపబడింది. నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న స్నేహ ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాస్ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో మెప్పిస్తుంది. ఈ క్రమంలో తాజాగా స్నేహ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు..

ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోన్న స్నేహ.. కొత్తగా చీరల వ్యాపారం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భార్యాభర్తల బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ’’బంధంలో పొసెసివ్నెస్ అనేది ఉండాలి కానీ.. అది అతిగా ఉండకూడదు. అది ఎక్కువైతే నమ్మకాన్ని కోల్పోతాం. ఉదాహరణకు భార్యాభర్తల మధ్య బయటకు ఎందుకు వెళ్తున్నావ్.. ఈ సమయంలో వెళ్లి ఏం చేస్తావ్.. ఇలాంటి ప్రశ్నలు తలెత్తకూడదు. మనల్ని అవతలి వ్యక్తి సరిగా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలు రావు. దంపతులకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి‘‘ అని చెప్పుకొచ్చింది స్నేహ.

actress sneha shocking comments on her husband

’’ఎదుటి వ్యక్తి మనల్ని అడిగే ముందే.. నేను ఫలానా చోటుకు వెళ్తున్నాను.. ఈ సమయంలోగా వచ్చేస్తాను.. అని వారికి ముందే చెప్పాలి. బయటకు వెళ్లాక మీకు టైమ్ ఉంటే ఒకసారి మీ పార్టనర్ కి కాల్ చేసి రీచ్ అయ్యాను.. తిన్నావా లేదా అని అడగాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే బంధంలో ప్రేమను, నమ్మకాన్ని పెంచుతాయి. పెళ్లైన కొత్తలో నేను కూడా పొసెసివ్గా ఉండేదాన్ని. అలా అని నా భర్తపై నాకు నమ్మకం లేనట్లు కాదు‘‘ అని చెప్పుకొచ్చింది స్నేహ.

ఇక తన భర్త గురించి మాట్లాడుతూ.. ’’గతంలో మా ఆయన ఓ అమ్మాయిని ప్రేమించాడు.. కానీ తనతో బ్రేకప్ అయ్యింది. దాని వల్ల నాకెలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఆ అమ్మాయితో విడిపోవడంలో వల్లే మేం ఇద్దరం కలవగలిగాము. లేదంటే తను నాకు భర్తగా దొరికి ఉండేవాడు కాదు. గతంలో నాకు ఓ సమస్య వచ్చింది. దాంతో ఆ ఏడాదంతా నాకు కష్టంగా గడిచింది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. సరిగ్గా అప్పుడే నాకు ఉత్తమ నటిగా తమిళ ఫిలిం అవార్డు వచ్చింది. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడ్డాను‘‘ అని చెప్పుకొచ్చింది స్నేహ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి