iDreamPost

ఆస్పత్రిలో చేరిన సల్మాన్ హీరోయిన్.. కారణం ఏంటంటే?

  • Author singhj Published - 02:26 PM, Tue - 10 October 23
  • Author singhj Published - 02:26 PM, Tue - 10 October 23
ఆస్పత్రిలో చేరిన సల్మాన్ హీరోయిన్.. కారణం ఏంటంటే?

హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే పోటీ గురించి తెలిసిందే. అక్కడ స్టార్​గా పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. చాలా మటుకు వారసత్వం ద్వారానే ఛాన్సులు అందుకుంటారు. కానీ కొందరు మాత్రం స్వయంకృషిని నమ్ముకొని పట్టుదలతో తాము అనుకున్న పొజిషన్​కు చేరుకుంటారు. అలాంటి వారిలో ఒకరు షెహనాజ్ కౌర్ గిల్. మోడల్​గా కెరీర్​ను స్టార్ట్ చేసిన ఈ అందాల రాశి.. 2019లో రియాలిటీ షో బిగ్​బాస్​13 పాల్గొని మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ మూవీలోనూ మెరిశారు.

భూమి పెడ్నేకర్, షిబానీ బేడీ, కుషా కపిలతో కలసి ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ మూవీలోనూ షెహనాజ్ గిల్ నటించారు. అందంతో పాటు యాక్టింగ్ టాలెంట్ కూడా ఉండటంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ టైమ్​లో షెహనాజ్ ఆస్పత్రి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యంతో బాధపడుతున్న షెహనాజ్​ను ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ మూవీ కో-ప్రొడ్యూసర్ రియా కపూర్ హాస్పిటల్​లో జాయిన్ చేశారు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో షెహనాజ్​కు ట్రీట్​మెంట్ జరుగుతోందని తెలిసింది. ఆమె అస్వస్థతకు ఫుడ్ పాయిజనింగ్ కారణమట.

శాండ్​విచ్ తినడం వల్లే తనకు ఫుడ్ ఇన్​ఫెక్షన్ అయిందని ఇన్​స్టాగ్రామ్​ లైవ్​లో షెహనాజ్ గిల్ తెలిపారు. తానిప్పుడు బాగానే ఉన్నానని.. ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కొంతమేరకు ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. ఇలాంటి టైమ్ అందరికీ ఎదురవుతుందని.. ఆ తర్వాత దానంతట అదే తగ్గిపోతుందన్నారీ బ్యూటీ. తన గురించి ఫ్యాన్స్ ఎవరూ టెన్షన్ పడొద్దని.. మరో రెండ్రోజుల్లో ఇంటికి చేరుకుంటానని షెహనాజ్ పేర్కొన్నారు. కాగా, షెహనాజ్ యాక్ట్ చేసిన ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ మూవీ అక్టోబర్ 6న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక, హీరోయిన్​గానే గాక బాలీవుడ్​లో సింగర్​గానూ షెహనాజ్ రాణిస్తుండటం విశేషం. మరి.. నటి షెహనాజ్ ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఆస్పత్రి పాలవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ‘యానిమల్​’ కోసం సందీప్ రెడ్డి ప్లానింగ్ మామూలుగా లేదుగా!

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి