iDreamPost
android-app
ios-app

అన్ని కోట్లు పెట్టి ప్రైవేట్‌ జెట్‌ కొన్న నయనతార!

  • Published Sep 27, 2023 | 7:57 PM Updated Updated Sep 27, 2023 | 7:57 PM
  • Published Sep 27, 2023 | 7:57 PMUpdated Sep 27, 2023 | 7:57 PM
అన్ని కోట్లు పెట్టి ప్రైవేట్‌ జెట్‌ కొన్న నయనతార!

సౌత్‌ ఇండియాలో టాప్‌ మోస్ట్‌ స్టార్‌ హీరోయిన్లలో లేడీ అమితాబ్‌ నయనతార మొదటి వరుసలో ఉంటారు. నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో ఆమె నటించిన తాజా చిత్రం ‘జవాన్‌’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఆమె రెండు తమిళ సినిమాల షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. నయనతార ఆస్తుల గురించిన వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

ముఖ్యంగా ఆమెకు చెందిన ఓ ప్రైవేట్‌ జెట్‌ వివరాలు ఆసక్తికరంగా మారాయి. దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన నయనతార 50 కోట్ల రూపాయలు పెట్టి ఓ ప్రైవేట్‌ జెట్‌ కొన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం ఆమె ఈ ప్రైవేట్‌ జెట్‌ కొన్నారు. ఇప్పుడు ఆ జెట్‌ను నయనతార, భర్త కలిసి వాడుతున్నారు. షూటింగులకు వెళ్లడానికి.. ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఆ ప్రైవేట్‌ జెట్‌ను వాడుతున్నారు. ఈ ప్రైవేట్‌ జెట్‌ ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

ఈ ప్రైవేట్‌ జెట్‌తో పాటు నయనతారకు చెన్నై, హైదరాబాద్‌లలో ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. కేరళలో వంశపారపర్యంగా వస్తున్న ఇళ్లు.. కేరళ, తమిళనాడు వ్యాప్తంగా స్థలాలు ఉన్నాయి. వీటితో పాటు కోట్లు విలువ చేసే కార్లు ఆమె సొంతం. ​కాగా, నయనతార ‘ 2006లో వచ్చిన ‘ లక్ష్మీ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. స్టార్‌ హీరోలందరితోనూ ఆమె నటించారు. చివరగా.. చిరంజీవితో కలసి ‘గాడ్‌ ఫాదర్‌’సినిమాలో ఆమె నటించారు. మరి, నయనతార ప్రైవేట్‌ జెట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet