iDreamPost

ఆ స్టార్ హీరోతో Jr. NTR హీరోయిన్ డేటింగ్? క్లారిటీ ఇచ్చేసిన బ్యూటీ!

జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తనపై వచ్చిన డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. మరి ఆ బ్యూటీ ఎవరు? డేటింగ్ పై ఏం చెప్పింది? ఆ వివరాలు..

జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తనపై వచ్చిన డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. మరి ఆ బ్యూటీ ఎవరు? డేటింగ్ పై ఏం చెప్పింది? ఆ వివరాలు..

ఆ స్టార్ హీరోతో Jr. NTR హీరోయిన్ డేటింగ్? క్లారిటీ ఇచ్చేసిన బ్యూటీ!

ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి, డేటింగ్, విడాకులకు సంబంధించి ఏదో ఒక న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఇక కొందరు తమ రిలేషన్ షిప్ పై డైరెక్ట్ గానే స్పందిస్తారు. మరికొందరు మాత్రం దారంతెగే దాక లాగుతుంటారు. కెమెరా కంటికి చిక్కిన తర్వాత గానీ మరికొందరి ప్రేమ వ్యవహారం బయటపడదు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తనపై వచ్చిన డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. మరి ఆ బ్యూటీ ఎవరు? డేటింగ్ పై ఏం చెప్పింది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది హీరోయిన్ మమతా మోహన్ దాస్. తెలుగు, తమిళం, మలయాళం బాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే క్యాన్సర్ బారినపడింది ఈ అమ్మడు. కొన్నాళ్లపాటు ఆ మహమ్మారి వ్యాధికి చికిత్స తీసుకుని ప్రాణాలతో భయటపడింది. ప్రస్తుతం మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గతేడాది జగపతి బాబు నటించిన ‘రుద్రాంగి’ మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ మూవీలో కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మమతా మోహన్ దాస్ పలు ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తనపై వచ్చిన డేటింగ్ రూమర్లపై స్పందించింది. మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ..”నేను లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పుడు అక్కడ ఓ వ్యక్తిని ప్రేమించాను. కానీ మా బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. అయితే లైఫ్ లో రిలేషన్ ఉండాలి కానీ.. దాని వల్ల వచ్చే ఒత్తిడి మాత్రం ఉండకూడదు. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలీదు. ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్నాను. పార్ట్ నర్ కోసం వెతుకుతున్నాను. కాలంతో పాటుగా అన్ని విషయాలు  బయటపడాల్సిందే” అంటూ తాను హీరోతో కాదు డేటింగ్ లో ఉంది.. వేరే వ్యక్తితో అని క్లారిటీ ఇచ్చేసింది ఈ బ్యూటీ. ఇక రిలీజ్ కాబోతున్న మహారాజా మూవీతో ఏ మేరకు మెప్పిస్తో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి