iDreamPost

ఓటిటిలోకి రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు! స్ట్రీమింగ్ ఎందులో అంటే..

  • Author ajaykrishna Published - 03:45 PM, Fri - 4 August 23
  • Author ajaykrishna Published - 03:45 PM, Fri - 4 August 23
ఓటిటిలోకి రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు! స్ట్రీమింగ్ ఎందులో అంటే..

థియేటర్స్ లో విడుదల అవుతున్న సినిమాలు ఎన్ని హిట్ అవుతున్నాయి.. ఎన్ని ప్లాప్ అవుతున్నాయి? అనే విషయం పక్కన పెడితే.. అతి కొద్దిరోజులలో ఓటిటి బాట పడుతున్నాయి అనేది నిజం. ఏ స్టార్ సినిమా అయినా.. ఏ భాషకు చెందిన సినిమాలైనా అలా రిలీజ్ అవుతున్నాయో లేదో.. నెల తిరిగే లోపల డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. అయితే.. ఓటిటి సినిమాలలో కూడా డబ్బింగ్ సినిమాలు కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. ఒక భాషలో సూపర్ హిట్ అయ్యాయంటే.. ఈరోజుల్లో ఆ సినిమాలను మన భాషలో చూడాలని చాలామందికి అనిపిస్తుంది. అందుకే.. అవి ఓటిటి రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతాయి? తెలుగులో వస్తుందా లేదా అని ఆరా తీస్తుంటారు.

తాజాగా ఇటీవల విడుదలైన రెండు తమిళ సినిమాలు ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వీటిలో ఒకటి కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కాగా.. రెండోది తమిళ, తెలుగు భాషలలో విడుదలై ఫలితం పరంగా నిరాశపరిచింది. మరి ఆ రెండు సినిమాలేంటంటే.. ఒకటి విజయ్ ఆంటోనీ నటించిన హత్య.. రెండోది అశోక్ సెల్వన్, శరత్ కుమార్ నటించిన ‘పోర్ తొలిల్’. ఇందులో పోర్ తొలిల్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా.. ఇంటరెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ సీక్వెన్స్ లతో సాగుతుంది. అయితే.. అశోక్ సెల్వన్, శరత్ కుమార్ సినిమాలు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఒక్కోసారి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటాయి. కానీ.. ఎందుకో ఈ సూపర్ హిట్ సినిమాని తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేయలేదు.

ఇదిలా ఉండగా.. పోర్ తొలిల్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సోనీలివ్ వారు సొంతం చేసుకున్నారు. ఆగష్టు 11 నుండి ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులోకి రానుంది. మరోవైపు బిచ్చగాడు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ.. ఈ ఏడాది బిచ్చగాడు సీక్వెల్ తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. కానీ.. ఆ తర్వాత చేసిన హత్య మూవీతో మళ్లీ ప్లాప్ ని మూటగట్టుకున్నాడు. అయితే.. జులై 22న థియేటర్స్ లో విడుదలైన హత్య మూవీ.. నెల రోజులకు అంటే ఆగష్టు 20 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఒకేసారి తమిళ, తెలుగు భాషలలో అందుబాటులోకి రానుందట. మరి ఓటిటి మూవీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి