iDreamPost

రేవ్ పార్టీ కేసు.. బురఖాలో ఆసుపత్రిలో నటి హేమ!

Actress Hema: రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరెస్ట్ నేపథ్యంలో ఆమెకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు.

Actress Hema: రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరెస్ట్ నేపథ్యంలో ఆమెకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు.

రేవ్ పార్టీ కేసు.. బురఖాలో ఆసుపత్రిలో నటి హేమ!

గత కొన్ని రోజులుగా బెంగళూరు రేవ్ పార్టీ కేసు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నటి హేమ సహా పలువురు సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. అయితే ఆమె మాత్రం రేవ్ పార్టీకే వెళ్ళలేదు అని బుకాయించింది. మొదటి రోజు తాను ఇంట్లో ఉన్నానంటూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ తర్వాత బిర్యానీ చేస్తున్నా అంటూ మరొక వీడియో రిలీజ్ చేసింది. వీడియోలో వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. అయితే బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె అబద్ధం చెప్తుందని.. రేవ్ పార్టీలో పాల్గొందని అన్నారు. ఆమె బ్లడ్ శాంపిల్స్ లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైందని అన్నారు.

తాజాగా ఈ కేసులో నటి హేమను బెంగళూరు పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా హేమ అరెస్ట్ నేపథ్యంలో ఆమెకు ఫార్మాలిటీ ప్రకారం వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. అందుకోసం ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె బురఖా ధరించి ఉండడం గమనార్హం. ప్రస్తుతం బురఖాలో టెస్టులు చేయించుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటి వరకూ హేమ అరెస్ట్ విషయానికి సంబంధించి బెంగళూరు సీసీఎస్ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో హేమ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా అందులో 86 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వీరిలో హేమ కూడా ఉంది. బ్లడ్ శాంపిల్స్ ద్వారా హేమ ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. విచారణకు హాజరు కావాలని ఆమెకు నోటీసులు పంపించారు. అయితే ఆరోగ్యం బాలేని కారణంగా రాలేకపోతున్నా అని సాకు చెప్పి హేమ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంది.

ఆ తర్వాత బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు పంపినా కూడా స్పందించలేదు. దీంతో పోలీసులు హైదరాబాద్ లో ఆమె ఇంటికి వెళ్లి మరీ విచారించారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ నేపథ్యంలో ఆమెకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. డ్రగ్స్ తీసుకున్నందుకు ఒక కేసు, కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు మరో కేసు హేమ మీద పోలీసులు నమోదు చేశారు. మరి ఆమెపై ఎలాంటి సెక్షన్లు కింద కేసు నమోదు చేస్తారో అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి