iDreamPost

జిమ్‌లో ఈ రేంజ్ వర్కౌట్స్.. మరో హీరోయిన్స్‌కి సాధ్యం కాదు!

శరీరాన్ని విల్లులా వంచిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? చిన్నప్పటి నుండే సినిమాలు స్టార్ చేసి.. హీరోయిన్ గా మారి.. స్టార్ డమ్ తెచ్చుకుంది. పెళ్లైనా కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

శరీరాన్ని విల్లులా వంచిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? చిన్నప్పటి నుండే సినిమాలు స్టార్ చేసి.. హీరోయిన్ గా మారి.. స్టార్ డమ్ తెచ్చుకుంది. పెళ్లైనా కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

జిమ్‌లో ఈ రేంజ్ వర్కౌట్స్.. మరో హీరోయిన్స్‌కి సాధ్యం కాదు!

అందమే కాదూ ఒద్దికైన శరీర సౌష్టవం కూడా చాలా అవసరం హీరోయిన్లకు. ఏ ఇండస్ట్రీ అయినా బొద్దుగుమ్మలకన్నా ముద్దుగుమ్మలకే అవకాశాలు ఇస్తోంది. దీన్నే దృష్టిలో పెట్టుకుని హీరోయిన్లు ఎప్పుడూ నాజూకుగా ఉండేందుకు కసరత్తలు ప్రారంభిస్తారు. తొలుత బొద్దుగా ఉన్నా.. ఆ తర్వాత సన్నబడేందుకు డైట్ మెయిన్ టెన్ చేస్తూ.. జిమ్, యోగా వంటివి స్టార్ చేస్తారు. షూటింగ్స్ ఉంటే మార్నింగే వర్కౌట్ చేస్తుంటారు. చిన్నపాటి వామ్ అప్ అయినా చేయాల్సిందే. ఇక తీరిక సమయం దొరికితే.. గంటలు గంటలు తమ ఒంటిని శ్రమ పెడుతూ ఉంటారు. మూవీ ఛాన్స్‌ల కోసమే కాకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ.. ఫిజికల్ ఫిట్ నెస్‌పై దృష్టి సారిస్తున్నారు నేటి భామలు.

ఇదిగో ఈ ఫోటోలో హీరోయిన్ గుర్తు పట్టారా.. శరీరాన్ని విల్లులా వంచి వర్కౌట్స్ చేస్తున్న ఈ బ్యూటీ.. ఇండస్ట్రీలోకి వచ్చి చానాళ్లయ్యింది. ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా వర్కౌట్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ భామ చైల్డ్ ఆర్టిస్టుగా అలరించి.. చిన్న వయస్సులోనే హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ బడా హీరోలతో జత కట్టిన అమ్మడు..దక్షిణాది పరిశ్రమను చుట్టేసింది. హిందీలోనూ అడపాదడపా చేసింది ఈ యాపిల్ బ్యూటీ. తొలుత లావుగా ఉన్నా.. ఆ తర్వాత శరీరాన్ని నాజూగ్గా మలచుకుని.. యూత్ గుండెల్లో గుడికట్టేసుకుంది. కోలీవుడ్ ఫ్యాన్స్ అయితే ఆమెకు ఏకంగా గుడే కట్టారనుకోండి. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టేశారు కదా. క్యూట్ లేడి హన్సిక మొత్వానీ. కోయి మిల్ గయాతో పాటు అనేక హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఈ భామ.. 16 ఏళ్లకే దేశముదురు మూవీతో హీరోయిన్‌గా మారింది.

 బొద్దుగా ఉందన్న విమర్శలను ఎదుర్కొని నాజూగ్గా మారిపోయింది .  ఆ తర్వాత తెలుగులో కంత్రీ, మస్కా, సీతారాముల కళ్యాణం లంకలో, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, పాండవులు, పాండవులు తుమ్మెద, పవర్, సైజ్ జీరో, లక్కున్నోడు, గౌతమ్ నంద, తెనాలి రామకృష్ణ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు తెలుగు కన్నా తమిళనాడులో మంచి నేమ్ అండ్ ఫేమ్ దక్కింది. అక్కడ ఆమెను దేవతను చేసేసి గుడి కట్టారు. రీసెంట్ గా 105 మినిట్స్ అనే మూవీతో పలకరించింది. కేవలం ఒకే పాత్ర కనిపిస్తుంది ఈ సినిమాలో. 2022లో సోహైల్ కటూరియా అనే వ్యాపారిని మనువాడింది. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తోంది. హన్సిక నటించిన చిత్రాల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి