iDreamPost

మరీ ఇంత చీప్‌గానా అంటూ.. నటి కన్నీరు

వీడియోలు సెన్సేషన్ అవ్వడం కోసం, రీచ్ పెరగడం కోసం యూట్యూబర్లు.. ఇష్టమొచ్చినట్లుగా థంబ్ నెయిల్స్ పెడుతుంటారు. వీడియోతో సంబంధం లేకుండా థంబ్ నెయిల్స్ ఉంటాయి. ముఖ్యంగా నటీనటులకు సంబంధించని తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో పెడుతుంటారు. దీని వల్ల

వీడియోలు సెన్సేషన్ అవ్వడం కోసం, రీచ్ పెరగడం కోసం యూట్యూబర్లు.. ఇష్టమొచ్చినట్లుగా థంబ్ నెయిల్స్ పెడుతుంటారు. వీడియోతో సంబంధం లేకుండా థంబ్ నెయిల్స్ ఉంటాయి. ముఖ్యంగా నటీనటులకు సంబంధించని తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో పెడుతుంటారు. దీని వల్ల

మరీ ఇంత చీప్‌గానా అంటూ.. నటి కన్నీరు

సోషల్ మీడియాను కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు. తమ స్వార్థం, స్వలాభం కోసం ఇష్టమొచ్చినట్లుగా నటీనటులపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఇలాంటి ఫేక్ వీడియోలు కోకోల్లలు. మొన్న జబర్దస్ నటుడు ఇమ్మాన్యుయేల్ చనిపోయాడంటూ ఓ వీడియో వచ్చిన సంగతి విదితమే. దానిపై అతను బయటకు వచ్చి మరీ బతికే ఉన్నారురా బాబు అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇటీవల వస్తున్న టెక్నాలజీ ఏఐ సాయంతో ప్రముఖ నటి రష్మిక మందాన్న ఫేస్‌ను మార్ఫింగ్ చేసి ఓ వీడియో వైరల్ చేసిన సంగతి విదితమే. దీంతో ఆ వీడియోలో ఉన్నది తాను కాదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది రష్మికకు.

ఈ వీడియోపై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ దగ్గర నుండి టాలీవుడ్ స్టార్ల వరకు స్పందించారు. వీడియోలో ఉన్న కంటెంట్ కాకుండా.. వేరో థంబ్ నెయిల్స్ లేదా కాంట్రవర్సీ అయ్యేలా వీడియోలు రూపొందించి.. ఇష్టాను సారంగా థంబ్ నెయిల్స్ పెట్టి సోషల్ మీడియాలోకి విడుదల చేస్తున్నారు కొందరు ఇన్‌ఫ్లూయన్సర్స్. దీని వల్ల నటీనటులు ఎంతో బాధపడుతున్నారు. తాజాగా అటువంటి వాటిపై మండిపడ్డారు ప్రముఖ మలయాళ నటి బీనా ఆంటోని. ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన మలయాళ టీవీ,సినీ నటి రెంజుషా మీనన్ మరణ వార్తకు సంబంధించి తాను చేసిన పోస్టును సంచనాల కోసం ఇష్టమొచ్చిన థంబ్ నెయిల్స్ పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన కంటెంట్ సృష్టించాలని వేడుకున్నారు.

తన ఇన్ స్టా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు బీనా ఆంటోనీ. చనిపోయిన వ్యక్తులను గౌరవించాలని నొక్కి చెప్పిన ఆమె..యూట్యూబ్ ఛానల్స్ నైతికత లేకుండా, తప్పుదారి పట్టించే విధంగా థంబ్ నెయిల్స్ పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు సమర్ధించదగినవి కాదన్నారు. ‘ గత కొన్ని నెలలుగా టీవీ పరిశ్రమకు చెందిన చాలా మందిని కోల్పోయాం. అపర్ణా నాయర్, రెంజూష, ఆదిత్యన్, డా ప్రియా. ఆ షాక్ నుండి ఇంకా కోలుకోలేదు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మమ్మల్ని బలిపశువుల్ని చేస్తున్నాయి. వారి రీచ్ కోసం ఎలా పడితే అలా వీడియోలు రూపొందిస్తున్నారు. రెంజూష మృతికి సంతాపంగా ఓ పోస్టు పంచుకుంటే.. సెన్సేషన్ అవ్వడం కోసం దాన్ని వీడియోగా రూపొందించి.. థంబ్ నెయిల్స్ చూసి ఆశ్చర్యపోయాను. ఇంత చీప్‌గా ఎలా చేస్తారు?’ అంటూ ప్రశ్నించారు.

రెంజూష కుటుంబం చూడదా.. వారు తన గురించి ఏమనుకుంటారని, దయ చేసి ఇలాంటివి ఆపండి అంటూ వేడుకున్నారు. అయితే దీనిపై నటి అవంతిక మోహన్ కూడా స్పందించారు. అమ్మా ప్లీజ్ ఇలాంటివి ఇగ్నోర్ చేయండని, కొన్ని సంవత్సరాల క్రితం వీటి నుండే తాను నేర్చుకున్నానని అన్నారు. పందులకు బురద అంటే ఇష్టమని (యూట్యూబర్లను ఉద్దేశించి) అలా అని మీరేంటో మాకు తెలుసునంటూ కామెంట్ చేశారు. కాగా, మలయాళ టీవీ, నటి రెంజుషా మీనన్ తిరువనంతపురంలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. ప్రస్తుతం బీనా అంటోనీ మౌనరాగం సీరియల్ లో నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Artiste Beena Antony (@imbeena.antony)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి