iDreamPost

అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అందుకే అవకాశాలు కోల్పోయానంటూ..!

  • Author singhj Published - 03:53 PM, Sat - 4 November 23

టాలీవుడ్ స్టార్ నటి అనసూయ తన కెరీర్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందువల్లే తాను హీరోయిన్​గా అవకాశాలు కోల్పోయానని అన్నారు.

టాలీవుడ్ స్టార్ నటి అనసూయ తన కెరీర్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందువల్లే తాను హీరోయిన్​గా అవకాశాలు కోల్పోయానని అన్నారు.

  • Author singhj Published - 03:53 PM, Sat - 4 November 23
అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అందుకే అవకాశాలు కోల్పోయానంటూ..!

యాంకర్​గా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో అనసూయ ఒకరు. హుషారైన మాటలు, గ్లామర్​తో అందరి దృష్టినీ ఆకర్షించారామె. యాంకరింగ్ ద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న అనసూయ.. ఇప్పుడు టాలీవుడ్​లో చాలా బిజీ అయిపోయారు. ‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాలు ఆమెకు ఓవర్​నైట్ స్టార్​డమ్ తీసుకొచ్చాయి. ఈ చిత్రాల్లో ఆమె నటనకు ఫిదా అయిన మేకర్స్.. అనసూయకు పిలిచి మరీ ఛాన్సులు ఇస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతగానో రాణిస్తున్నారు అనసూయ. అందానికి అందం, అభినయంలోనూ ఎవరికీ తీసిపోని ఆమె ఎందుకు హీరోయిన్​గా నటించలేదనే డౌట్ చాలా మంది ప్రేక్షకులకు ఉంటుంది. దీనిపై ఈ స్టార్ నటి తాజాగా క్లారిటీ ఇచ్చారు.

హీరోయిన్​ ఛాన్సులతో పాటు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ‘అత్తారింటికి దారేది’ మూవీలో స్పెషల్ సాంగ్​లో యాక్ట్ చేయకపోవడం మీదా అనసూయ క్లారిటీ ఇచ్చారు. ఒకప్పటి కంటే ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చిందన్నారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఒక పాటలో నటించాల్సిందిగా ఆఫర్ వచ్చిందన్నారు. అయితే అందులో ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని తాను చేయనని చెప్పానన్నారు అనసూయ. గుంపులో ఒకరిగా యాక్ట్ చేయడం తనకు నచ్చదని.. తనకంటూ స్పెషాలిటీ ఉండాలని కోరుకున్నానని ఆమె స్పష్టం చేశారు. అందుకే ఆ సాంగ్​కు నో చెప్పానని తెలిపారు. అయితే ఆ ఆఫర్​ను రిజెక్ట్ చేసినందుకు తనను చాలా మంది విమర్శించారని అనసూయ పేర్కొన్నారు.

ఆ సాంగ్​లో నటించనందుకు ట్విట్టర్​లో పెద్ద వార్ జరిగిందని.. ఆ తర్వాత త్రివిక్రమ్​కు సారీ చెప్పానన్నారు అనసూయ. షూటింగ్స్​లో తన పని తాను చూసుకొని వెళ్తుంటానని తెలిపారు. మూవీ అయ్యాక జరిగే పార్టీలకు తాను దూరంగా ఉంటానని అనసూయ స్పష్టం చేశారు. ‘సినిమా అయ్యాక జరిగే పార్టీలకు నేను వెళ్లను. వాటికి నేను దూరంగా ఉంటా. ఈ కారణం వల్లే నేను హీరోయిన్ ఛాన్సులను కూడా కోల్పోయా. పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయంటే నేను వాటిని ఎంకరేజ్ చేయను. ఒకప్పుడు ఏదైనా ఛాన్స్ వస్తే.. అందులో నాకే ఇంపార్టెన్స్ ఉండాలనుకున్నా. కానీ ఇప్పుడు నాలో ఛేంజ్ వచ్చింది. ఎలాంటి క్యారెక్టర్​లోనైనా నా యాక్టింగ్​తో గుర్తింపు తెచ్చుకోగలనని నమ్మకం కలిగింది’ అని అనసూయ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌కు హార్దిక్ పాండ్యా దూరం! అయినా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి