iDreamPost

వరల్డ్‌ కప్‌కు హార్దిక్ పాండ్యా దూరం! అయినా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు..

  • Published Nov 04, 2023 | 1:44 PMUpdated Nov 04, 2023 | 1:44 PM

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వరల్డ్‌ కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు పూర్తిగా దూరం అయ్యాడు. అయితే.. గాయంతో జట్టుకు దూరమైనా కూడా పాండ్యా తీసుకున్న ఓ నిర్ణయంపై క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు‍న్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వరల్డ్‌ కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు పూర్తిగా దూరం అయ్యాడు. అయితే.. గాయంతో జట్టుకు దూరమైనా కూడా పాండ్యా తీసుకున్న ఓ నిర్ణయంపై క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు‍న్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 04, 2023 | 1:44 PMUpdated Nov 04, 2023 | 1:44 PM
వరల్డ్‌ కప్‌కు హార్దిక్ పాండ్యా దూరం! అయినా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుత ఫామ్‌లో దూసుకెళ్తోన్న టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా గాయంతో టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ వరల్డ్‌ కప్‌లో పాండ్యా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న పాండ్యా.. దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బాల్‌ను కాలితో ఆపే క్రమంలో పాండ్యా గాయపడ్డాడు. వేగంగా కోలుకుని, తిరిగి జట్టులోకి వస్తాడని ఆశించినా.. అది జరగలేదు. దీంతో టీమిండియా గట్టి ఎదురుదెబ్బే తగిలిందని అనుకోవచ్చు. అయితే.. గాయంతో జట్టుతో కలిసి ఆడలేకపోతున్నా.. పాండ్యా తీసుకున్న నిర్ణయం మాత్రం క్రికెట్‌ అభిమానులకు సంతోషాన్ని ఇస్తోంది.

పాండ్యా గాయంతో వరల్డ్‌ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఇప్పటికే టీమిండియ సెమీస్‌ చేరడంతో మిగిలి ఉన్న రెండు లీగ్‌ మ్యాచ్‌లు, ఒక సెమీస్‌ కలుపుకుని మొత్తం మూడు మ్యాచ్‌లు మాత్రం టీమిండియా కచ్చితంగా ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లకు పాండ్యా అందుబాటులో ఉండడు. ఇక సెమీస్‌లోనూ విజయం సాధించి టీమిండియా ఫైనల్‌కు చేరితే మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో పాండ్యా లేకుండానే టీమిండియా బరిలోకి దిగాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం పాండ్యా లేకపోయినా టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. అలాగే పాండ్యా ఉండి ఉంటే.. ఇక భీకరంగా ఉండేది. కానీ, పాండ్యా లేడు. అయితే.. గాయంతో తాను గ్రౌండ్‌లోకి దిగకపోయినా.. జట్టుతోనే ఉండి, మిగతా ఆటగాళ్లను ఉత్సాహపరుస్తానని పాండ్యా వెళ్లడించాడు.

పాండ్యా లాంటి సీనియర్‌ ప్లేయర్‌ టీమ్‌తో ఉండటం మంచిదే. గాయంతో బాధపడుతున్న సమయంలో ఇంటికి వెళ్లి రెస్ట్‌ తీసుకోకుండా.. జట్టుతోనే ఉంటే టీమ్‌లోని మిగతా ఆటగాళ్లను ఎంకరేజ్‌ చేస్తూ.. కప్పు కొట్టేందుకు సహాయ పడతానని పాండ్యా తీసుకున్న నిర్ణయంపై క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్‌ కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం కావడంపై పాండ్యా స్పందిస్తూ.. ‘ప్రపంచ కప్‌లో మిగిలిన భాగాన్ని నేను కోల్పోతాను అనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం కష్టం. నేను ప్రతి గేమ్‌లోని ప్రతి బంతికి వారిని ఉత్సాహపరుస్తూ, స్ఫూర్తితో జట్టుతో ఉంటాను. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. ఈ టీమ్‌ ఎంతో ప్రత్యేకమైనది. టీమిండియా ఒక్కరినీ గర్వపడేలా చేస్తుందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.’ అంటూ ట్వీట్‌ చేశాడు పాండ్యా. మరి గాయంతో బాధపడుతున్నా.. దేశం కోసం టీమ్‌తో ఉంటానని పాండ్యా తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి