iDreamPost

షాకింగ్: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య..

  • By ajaykrishna Updated - 01:20 PM, Tue - 19 September 23
  • By ajaykrishna Updated - 01:20 PM, Tue - 19 September 23
షాకింగ్: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య..

బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆ ఒక్క సినిమాతో హీరోగా తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల బిచ్చగాడు 2 మూవీతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు మీరా ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ షాకింగ్ న్యూస్ సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రస్తుతం మీరా వయసు 16 ఏళ్లు కాగా.. 12వ తరగతి చదువుతుందని తెలుస్తుంది. మరి ఎందుకు ఉరి వేసుకొని చనిపోయింది? అనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. కొన్నాళ్ళుగా మీరా డిప్రెషన్ తో బాధ పడుతుందట. రెండు నెలలుగా డిప్రెషన్ కి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందట. మరి ఇంతలోనే ఏమైందో గానీ.. సడన్ గా ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం ఒక్కసారిగా విజయ్ ఆంటోనీ ఫ్యామిలీలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఉదయం మూడు గంటల ప్రాంతంలో మీరా ఉరి వేసుకోగా.. ఆమెను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి మీరా చనిపోవడానికి అసలు కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మీరా ఆత్మహత్యకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారట.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)