iDreamPost
android-app
ios-app

OTT Details: అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ OTT పార్టనర్ ఫిక్స్!

  • Published Feb 01, 2024 | 10:27 PM Updated Updated Feb 01, 2024 | 10:29 PM

దుశ్యంత్ దర్శకత్వంలో తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుహాస్. ఫిబ్రవరి 2(శుక్రవారం) థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తన ఓటీటీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది.

దుశ్యంత్ దర్శకత్వంలో తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుహాస్. ఫిబ్రవరి 2(శుక్రవారం) థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తన ఓటీటీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది.

OTT Details: అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ OTT పార్టనర్ ఫిక్స్!

టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ నటీ, నటులు ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే నటనతో ఇండస్ట్రీని తమ వైపు చూసేలా చేసుకుంటారు. అలాంటి నటుల్లో ముందు వరుసలో ఉంటాడు సుహాస్. షార్ట్ ఫిల్మ్ లు చేసుకునే స్థాయి నుంచి సోలో హీరో రేంజ్ కు ఎదిగాడు ఈ యాక్టర్. కలర్ ఫొటోతో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ నటుడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా దుశ్యంత్ దర్శకత్వంలో తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుహాస్. ఫిబ్రవరి 2(శుక్రవారం) థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తన ఓటీటీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది. మరి ఈ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

సుహాస్.. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో తనలో ఉన్న నటుడిని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. అద్భుతమైన యాక్టింగ్ తో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ అనే సినిమాతో ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చాడు. ఈ చిత్రానికి దుశ్యంత్ దర్శకత్వం వహించగా.. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ అయిన మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మెుగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ మూవీలో సుహాస్ కు జోడీగా శివాని నటించింది. తాజాగా ఈ మూవీ తన ఓటీటీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ అయిన ‘ఆహా’ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. దీంతో సినిమా రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా బిగ్ టికెట్ ను ఆవిష్కరించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా మూవీ చూసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా అద్బుతంగా ఉందని ప్రశంసించాడు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/