iDreamPost

భూమిక షూటింగ్ మధ్యలో పారిపోయింది.. చంపేయాలనుకున్నా: శ్రీరామ్

శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్.. తెలుగులో ఒకరికి ఒకరు మూవీతో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తూ.. అక్కడ టాప్ స్టార్ గా ఎదిగాడు. కానీ తెలుగులో ఆ స్థాయి హీరోగా కొనసాగలేకపోయాడు. తాజాగా పిండం అనే మూవీతో రాబోతున్నాడు.

శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్.. తెలుగులో ఒకరికి ఒకరు మూవీతో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తూ.. అక్కడ టాప్ స్టార్ గా ఎదిగాడు. కానీ తెలుగులో ఆ స్థాయి హీరోగా కొనసాగలేకపోయాడు. తాజాగా పిండం అనే మూవీతో రాబోతున్నాడు.

భూమిక షూటింగ్ మధ్యలో పారిపోయింది.. చంపేయాలనుకున్నా: శ్రీరామ్

రోజాపూలు సినిమాతో మ్యాజిక్ చేశాడు శ్రీరామ్ అనే కుర్రాడు. ఈ మూవీతో మంచి క్రేజ్ వచ్చింది. తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ మంచి పేరు తెచ్చింది. ఒకరికి ఒకరు అనే తెలుగు సినిమా చేసి టాలీవుడ్ కుర్రాడు అయిపోయాడు. తెలుగులో శ్రీరామ్ అని పిలుస్తారు కానీ..అతడి అసలు పేరు శ్రీకాంత్. ఇదే పేరుతో తమిళ, మలయాళంలో అనేక సినిమాల్లో కనిపించాడు. తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నిప్పు, సుప్రీం, లై, శ్రీనివాస కళ్యాణం, రాగల 24 గంటల్లో, టెన్త్ క్లాస్ డైరీస్, రావణాసుర వంటి చిత్రాల్లో మెరిశాడు. తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడూ తండ్రి మాతృభాష అయిన తెలుగులో (తండ్రి చిత్తూర్-తల్లి తమిళనాడు) చిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు.

ప్రస్తుతం పిండం అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరామ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అమ్మా నాన్న తమిళమ్మాయి ఆఫర్ రాగా, గాయాల కారణంగా ఈ సినిమాను తిరస్కరించాడట. దీంతో ఈ అవకాశం రవితేజను వరించుకుంటూ వెళ్లిందని చెప్పారు. ప్రముఖ నిర్మాత కోన వెంకట్.. ఒకరికి ఒకరు, ఈ సినిమాకు ఎంపిక చేసి.. ప్రకటించేశారు కూడా. ఆ సమయంలో త్రిషతో చేస్తున్న మనసెల్లాం షూటింగ్ సమయంలో శ్రీరామ్ గాయాలు పాలయ్యారట. అమ్మా, నాన్న, తమిళమ్మాయిలో ఫైట్ సీన్స్ ఉండటంతో.. ఈ సినిమా నుండి బయటకు వచ్చేశానని చెప్పారు శ్రీరామ్. రవితేజ ఆ ఆఫర్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఓ సినిమా షూటింగ్ సమయంలో భూమికతో గొడవలు జరిగాయని, సగం పాటలో పారిపోయిందని చెప్పాడు శ్రీరామ్. ‘ఆ తర్వాత ఎయిర్ పోర్టులో కనిపిస్తే .. హే షూటింగ్ ఎలా జరిగిందని అడిగింది. ఆ సమయంలో నా దగ్గర చాకు ఉంటే పొడిచేసే వాడిని అన్నాడు. ఇటీవలే మాట్లాడుకున్నాం. నువ్వొచ్చి షూటింగ్ ఎలా జరిగిందన్నప్పుడు చిరాకు వచ్చిందని చెబితే.. నవ్వింది. నేను కూడా ఈ రోజు నవ్వుతున్నాను. కానీ ఆ రోజు చంపేయాలనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. రవితేజతో  వర్క్ చాలా ఈజీగా అనిపిస్తుందన్నారు.  వీటితో పాటు పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నాడు. మీకు ఈ హీరో అంటే ఏ మూవీ గుర్తుకు వస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి