iDreamPost
android-app
ios-app

మెున్న ప్రభాస్, నేడు మెగాస్టార్.. కన్నప్ప కోసం స్టార్ హీరోలు!

  • Author Soma Sekhar Published - 05:08 PM, Sat - 30 September 23
  • Author Soma Sekhar Published - 05:08 PM, Sat - 30 September 23
మెున్న ప్రభాస్, నేడు మెగాస్టార్.. కన్నప్ప కోసం స్టార్ హీరోలు!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘భక్త కన్నప్ప’ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు మంచు హీరో. వరల్డ్ క్లాస్ టెక్నీషియన్లు మెుదలు కొని భారీ స్టార్ క్యాస్టింగ్ తో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీపై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేయడంలో సఫలం అయ్యాడు విష్ణు. న్యూజిలాండ్ కు 8 కంటెయినర్లలో షూటింగ్ కు సంబంధించిన సామాగ్రిని పంపించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక ఈ మూవీలో శివపార్వతులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నయనతారలు నటించబోతున్నట్లుగా వార్తలు వైరల్ గా మారడం మనకు తెలిసిన విషయమే. కాగా కన్నప్ప మూవీలోకి మెగాస్టార్ వచ్చి చేరాడని తెలుస్తోంది.

భక్త కన్నప్ప విషయంలో మంచు విష్ణు ఎక్కడా తగ్గట్లేదు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మోహన్ బాబు. ఇక ఈ చిత్రంలో శివుడిగా ప్రభాస్, పార్వతిగా నయనతార నటించనున్నారనే వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోకి మరో స్టార్ హీరో వచ్చి చేరాడని తెలుస్తోంది. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కన్నప్పలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఈ మేరకు తాజాగా మంచు విష్ణు మోహన్ లాల్ తో దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో భక్త కన్నప్ప మూవీలోకి మరో స్టార్ హీరో వచ్చి చేరినట్లు అయ్యింది.

ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు మంచు విష్ణు భారీగానే ప్లాన్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు. కాగా.. భక్త కన్నప్ప మూవీ మెుత్తం న్యూజిలాండ్ లోనే తెరకెక్కబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మూవీ టీమ్ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు మహాభారత సిరీస్ ను తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం సమకూరుస్తున్నారు. మరి భక్త కన్నప్ప కోసం భారీ క్యాస్టింగ్ ను బరిలోకి దింపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom