iDreamPost

హాట్ టబ్ లో పడి ప్రముఖ నటుడు, ప్రధాని క్లాస్ మెట్ అనుమానాస్పద మృతి!

  • Author Soma Sekhar Published - 03:37 PM, Sun - 29 October 23

ప్రముఖ నటుడు, కమెడియన్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. హాట్ టబ్ లో పడి అతడు మృతి చెందగా.. ఓ దేశ ప్రధాన మంత్రి అతడి క్లాస్ మెట్ కావడం గమనార్హం.

ప్రముఖ నటుడు, కమెడియన్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. హాట్ టబ్ లో పడి అతడు మృతి చెందగా.. ఓ దేశ ప్రధాన మంత్రి అతడి క్లాస్ మెట్ కావడం గమనార్హం.

  • Author Soma Sekhar Published - 03:37 PM, Sun - 29 October 23
హాట్ టబ్ లో పడి ప్రముఖ నటుడు, ప్రధాని క్లాస్ మెట్ అనుమానాస్పద మృతి!

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమలో పలు విభాగాలకు చెందిన నటీ, నటులు అకస్మాత్తుగా మరణిస్తూ.. అభిమానులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ అనుమానాస్పద రీతిలో హాట్ టబ్ లో పడి మరణించడం అందరిని షాక్ కు గురిచేసింది. అమెరికాకు చెందిన కమెడియన్ మాథ్యూ పెర్రీ(54) ఇంట్లో ఒక్కడే ఒంటరిగా జీవిస్తున్నాడు. హాట్ టబ్ లో విగతజీవిగా పడిఉన్న అతడిని చూసి అసిస్టెంట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పెర్రీ మృతిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు పోలీసులు.

అమెరికాకు చెందిన ప్రముఖ నటుడు, కమెడియన్ మాథ్యూ పెర్రీ హాట్ టబ్ లో పడి అనుమానాస్పద రీతిలో మరణించాడు. లాస్ ఏంజిల్స్ లో తన ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు పెర్రీ. ఈ క్రమంలోనే పెర్రీ శనివారం తన ఇంట్లోని హాట్ టబ్ లో నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన అసిస్టెంట్.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. శనివారం సాయంత్రం 4.10 గంటల సమీపంలో సమాచారం అందినట్లు లాస్ ఏంజిల్స్ పోలీస్ లు తెలిపారు. ఇక పెర్రీ మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే అతడి మరణం పూల్, స్పా లేదా హాట్ బాత్ టబ్, ఫౌంటెన్ లో మునిగి చనిపోయినట్లుగా పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. కాగా.. ఫెర్రీ ‘ఫ్రెండ్స్’ అనే సిరీస్ లో చాండ్లర్ బింగ్ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇదిలా ఉండగా.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పెర్రీ క్లాస్ మెంట్ కావడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి