iDreamPost

గంటల వ్యవధిలోనే ఒకే ఇంట్లో ఇద్దరు నటీమణులు మృతి

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాాజాాగా ఇద్దరు నటీమణులు కన్నుమూశారు. వీరిద్దరూ అక్కా చెల్లెళ్లు కావడం విషాదకరం. గంటల వ్యవధిలోనే..

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాాజాాగా ఇద్దరు నటీమణులు కన్నుమూశారు. వీరిద్దరూ అక్కా చెల్లెళ్లు కావడం విషాదకరం. గంటల వ్యవధిలోనే..

గంటల వ్యవధిలోనే ఒకే ఇంట్లో ఇద్దరు నటీమణులు మృతి

సినీ ఇండస్ట్రీని విషాదాలు వదలడం లేదు. బాలీవుడ్ టూ మాలీవుడ్ వరకు పలువురు సినీ సెలబ్రిటీలు ఇటీవల కాలంలో మృతి చెందారు. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య, యోగా టీచర్ రూహి అనారోగ్య సమస్యలతో మరణించారు. టీవీ ఇండస్ట్రీలో మొగలి రేకులు ఫేమ్ దయ అలియాస్ పవిత్ర నాథ్ ఈనెలలోనే తుది శ్వాస విడిచారు. బీటౌన్‌లో నటుడు రీతు రాజ్, సంగీత దర్శకుడు రషీద్ ఖాన్, ప్రముఖ సింగర్ పంకజ్ ఉదాస్ ఇలా వరుసగా కన్నుమూశారు. దంగల్ మూవీ నటి సుహాని భట్నాగర్ అనారోగ్య సమస్యలతో ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయిన సంగతి విదితమే. ఇప్పుడు ప్రముఖ నటీమణులు, అక్కాచెల్లెల్లు కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందారు.

బాలీవుడ్ టీవీ సీరియల్ నటి డాలీ సోహీ గర్బాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)తో పోరాడుతూ.. శుక్రవారం ఉదయం మరణించారు. ఆమె సోదరి, నటి అమన్ దీప్ సోహి మరణించిన కొన్ని గంటల్లోనే డాలీ కూడా ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. నటి అమన్ దీప్.. జాండీస్ (కామెర్ల)తో బాధపడుతూ గురువారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె సోదరుడు మన్ను సోహీ ధ్రువీకరించారు. గంటల వ్యవధిలోనే ఇద్దర్ని కోల్పోవడంతో కుటుంబమంతా కృంగిపోయినట్లు వెల్లడించారు. అలాగే డాలీ సోహీ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం జరుగుతాయని తెలిపారు. ‘ఈ తెల్లవారు జామున 4 గంటలకు డాలీ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో డాలీ, అమన్ దీప్ ఇద్దరూ ముంబయిలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అమన్ దీప్ గురువారం మరణించగా.. ఇప్పుడు డాలీ తుదిశ్వాస విడిచారు. మా కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది’ అంటూ మన్ను తెలిపారు.

డాలీ మరణ వార్తను ఆమె కుటుంబ సభ్యులు పంచుకున్నారు. గత సంవత్సరం డాలీ కీమో థెరపీ సెషన్ తర్వాత ఓ పిక్ షేర్ చేశారు. ‘ మీ ప్రేమ, ప్రార్థనలను అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జీవితం రోలర్ కోస్టర్ మాదిరిగా తయారయ్యింది. పోరాడే శక్తి మీకు ఉంటే.. మీ ప్రయాణం సులభతరం అవుతుంది. క్యాన్సర్ బాధితులుగానా, లేక సర్వైవల్ అయిన ప్రయాణమా మీ చేతుల్లోనే ఉంది’ కామెంట్ చేశారు. అంతలోనే సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించారు. డాలీ సోహి 2000-05 వరకు నుండి ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత 2012లో రీ ఎంట్రీ ఇచ్చి.. అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. మహాదేవ్, కుంకుమ భాగ్య, పరిణీతి, మేరీ దుర్గ, పియ అభిమాని వంటి సీరియల్స్ చేశారు. ‘ఝనక్’, మేరీ ఆషీకి తుమ్ సే హై, ఖూబ్ లడీ మర్దానీ, ఝాన్సీకీ రాణీ అనే సీరియల్స్ చేస్తున్నారు. ఇటీవల వివాదాస్పద నటి పూనమ్ పాండే.. ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి.. ఎవర్ నెస్ చేపట్టాలన్న ఉద్దేశంతో తాను చనిపోయానంటూ.. ఓ తప్పుడు సమాచారాన్ని షేర్ చేసి అభాసు పాలైన సంగతి విదితమే.

 

View this post on Instagram

 

A post shared by Dolly Sohi (@dolly_sohi)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి