iDreamPost

ఓటీటీలోకి 100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Article 370 Movie OTT Release: ఇటీవల భాషతో ఏమాత్రం సంబంధం లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

Article 370 Movie OTT Release: ఇటీవల భాషతో ఏమాత్రం సంబంధం లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

ఓటీటీలోకి 100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ హవా నడుస్తుంది. ప్రతి వారం పదుల సంఖ్యల్లో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతుండటంతో ఆడియన్స్ కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా వరకు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, హర్రర్ జోనర్, క్రైమ్ స్టోరీస్ ఇలా ఎన్నో రకాల కంటెంట్ తో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ కి ఓటీటీలో మంచి ఆధరణ లభిస్తుంది. ఇటీవల కొంతమంది నిర్మాతలు డైరెక్ట్ గా ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలో హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. తాజాగా దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ఓటీటీలో రిలీజ్ కి సిద్దమైంది. స్ట్రీమింగ్ ఎక్కడ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్టికల్ 370’. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్ముకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ అట్టుడికి పోయింది. రద్దు తర్వాత జరిగిన పరిణామాలు వాస్తవ సంఘటనల ఆధారంగా ఆదిత్య సుహాన్ జంభలే తెరకెక్కించిన చిత్రం ‘ఆర్టికల్ 370’. ఫిబ్రవరి 23న ధియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

ఆర్టికల్ 370 ధియేటర్లలో ప్రభవంజనం సృష్టించింది. ఈ ఏడాది వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఏప్రిల్ 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆర్టికల్ 370 ఓటీటీ రైట్స్ ని జియో సినిమా దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించగా.. బి62 స్టూడియోస్, జియో స్టూడియో పై లోకేష్ ధర్, ఆదిత్మ ధర్, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. ఈ మూవీ ధియేటర్లలో మిస్ అయిన వారు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి