iDreamPost

ప్రభుత్వ వాహనంలోనే గ్యాంగ్ రేప్.. జూబ్లిహిల్స్ అత్యాచార ఘటనలో కీలక విషయాలు వెల్లడి

ప్రభుత్వ వాహనంలోనే గ్యాంగ్ రేప్.. జూబ్లిహిల్స్ అత్యాచార ఘటనలో కీలక విషయాలు వెల్లడి

పదకొండు రోజుల క్రితం హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ ప్రాంతంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తెలుగురాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిలో ఐదుగురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్ కు తరలించారు. ప్రధాన నిందితుడైన సాదుద్దీన్(18) ను రిమాండ్ లో ఉంచారు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. జూబ్లిహిల్స్ అత్యాచార కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

మే 28వ తేదీన బాలికపై అఘాయిత్యం జరగ్గా.. 31న బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సోచట్టం కింద కేసు నమోదైంది. అనంతరం బాలికనుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ప్రభుత్వ వాహనం స్టిక్కర్ ఉన్న ఇన్నోవా కారులోనే బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది. వెంటనే ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ ను, మరో ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో ఐదుగురు మైనర్లు కావడంతో వారి వివరాలను వెల్లడించలేదు. వారందరినీ జువైనల్ హోమ్ కు తరలించారు.

అమ్నీషియా పబ్ వద్ద బాధితురాల్ని బెదిరించి.. మెర్సిడెజ్ కారులో ఎక్కించుకుని.. బంజారాహిల్స్ వెళ్లారు. అక్కడ కాన్సూ బేకరీ వద్ద ఇన్నోవా కారులోకి మార్చి.. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి సమీపంలో నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారం చేశారు. అయితే ఈ వ్యవహారంలో హోంమంత్రి మనువడి ప్రమేయం కూడా ఉందని వస్తున్న ఆరోపణలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. అందుకు తగిన సాక్ష్యాధారాలను చూపితే.. అతనిపై కూడా కేసు నమోదు చేస్తామని సీపీ ఆనంద్ వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి