iDreamPost

కేవలం రూ.49తో రూ.లక్ష.. ఫోన్‌పే అదిరే శుభవార్త!

కేవలం రూ.49తో రూ.లక్ష.. ఫోన్‌పే అదిరే శుభవార్త!

ఫోన్ పే గురించి తెలియని వారుండరు. ఇది వినియోగదారుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు అనేక కొత్తగా మారుతుంది. ప్రస్తుతం చెల్లింపులకు సంబంధించి.. ఫోన్ పేను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ఫోన్ పే కూడా వినియోగదారులకు అనేక సర్వీసులను అందిస్తోంది. అలాంటి వాటిల్లో  ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా కవరేజ్ సొంతం చేసుకోవచ్చు. ఫోన్ పే అందిస్తున్న ఈ సర్వీస్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. మరి.. ఈ సర్వీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నేటికాలంలో ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎంతో ముఖ్యం. కారణం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరం చెప్పలేము. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి.. వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబానికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగ పడుతుంది. ఈ క్రమంలో ఎన్నో సంస్థలు ఇన్సూరెన్స్ పాలసీను అందిస్తున్నాయి. అలానే ఫోన్‌ఫే కూడా యూజర్లకు గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తోంది. అయితే ఇక్కడ తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ బీమా కవరేజ్ సొంతం చేసుకోవచ్చు. ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా మొత్తం నామినీకి చెందుతుంది.

ఈ పాలసీ కోసం ఎలాంటి ఆరోగ్య చెకప్ లేకుండా పాలసీ తీసుకోవచ్చు. తక్కువ డాక్యుమెంట్లతోనే మీరు ఎప్పుడైనా ఈ పాలసీ పొందవచ్చు. 24 గంటలూ సేవలు అందుబాటులో ఉంటాయి.  కేవలం మరణిస్తేనే కాకుండా  కంటి చూపు కోల్పోయినా, శాశ్వత అంగ వైకల్యం సంభవించినా బీమా మొత్తం పూర్తిగా లభిస్తుంది. 18 నుంచి 65 ఏళ్ల వరకు వయసు ఉన్నవారు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ పాలసీకి అర్హలు. సూసైడ్ తో మరణిస్తే ఈ పాలసీ వర్తించదు.

ఇక ఈ పాలసీ ప్రీమియంల విషయానికి వస్తే… రూ. 50 వేల నుంచి రూ. 20 లక్షల వరకు తీసుకోవచ్చు. ప్రీమియం రూ.20 చెల్లించాలిస్తే.. రూ. 50 వేల బీమా తీసుకొవచ్చు. అదే రూ. లక్ష బీమా మొత్తం అయితే ప్రీమియం రూ.49 మాత్రే పడుతుంది. అంటే కేవలం రూ.49కే రూ.లక్ష తీసుకోవచ్చు.ఇక రూ. 5 లక్షల బీమాకు కోసం  ప్రీమియం రూ. 249 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా రూ.549 ప్రీమియం  తీసుకుంటే.. రూ. 10 లక్షల మొత్తానికి బీమా వర్తిస్తుంది. ఇక రూ. 20 లక్షల బీమా మొత్తానికి అయితే ప్రీమియం రూ. 1099 పడుతుంది.

ఇలా ఎవరికి నచ్చిన బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. ఆర్థిక భద్రత కల్పించ డానికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం ఉత్తమం. ఇక ఈ పాలసీని ఫోన్‌పే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో అందిస్తోంది. ప్రతి ఏటా మీరు ఈ పాలసీని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. పాలసీ తీసుకున్న తర్వాత 15 రోజులు ప్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. పాలసీ వద్దనుకుంటే వెనక్కి ఇవ్వొచ్చు. మరి.. ఫోన్ పే అందిస్తున్న ఈ పాలసీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయిండి.

ఇదీ చదవండి: మార్కెట్ లోకి జియో ల్యాప్ టాప్.. రూ. 16వేలు మాత్రమే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి