iDreamPost

మార్కెట్ లోకి జియో ల్యాప్ టాప్.. రూ. 16వేలు మాత్రమే!

మార్కెట్ లోకి జియో ల్యాప్ టాప్.. రూ. 16వేలు మాత్రమే!

రిలయన్స్.. ఈ దిగ్గజ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసంస్థకు చెందిన రిలయన్స్ జియో దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టెలికాం రంగంలోకి ప్రవేశించే తొలి రోజుల్లో ఫ్రీగా సిమ్‌, టాక్ టైమ్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించింది.  ఆ తరువాత తక్కువ ధరకే మొబైల్ హ్యాండ్‌సెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మధ్యలో ఈ మొబైల్ హ్యాండ్‌సెట్ల విక్రయాలను నిలిపివేసింది. అయితే తాజాగా మరో సంచలనానికి రిలయన్స్ జియో సిద్ధమైంది. దేశీయ మార్కెట్లో 4జీ సిమ్‌ ఆధారిత ల్యాప్‌టాప్‌ ‘జియోబుక్‌’ పరిచయం చేసింది.

సోమవారం రిలయన్స్ జియో బుక్ పేరుతో మరో ల్యాప్ టాప్ ఇండియన్ మార్కెట్ లోకి విడుదలైంది. గత ఏడాది అక్టోబరులో విడుదల చేసిన జియో బుక్ కు కొనసాగింపుగా దీనిని తీసుకొచ్చారు. తొలి వర్షన్ తో పోలిస్తే దీని డిజైన్, పనితీరు మెరుగ్గా ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. లేటెస్ట్ అప్ డేట్ లకు అనుగుణంగా ఈ ల్యాప్ టాప్ ను రూపొందించారు. ఇక ఇందులోని ఫీచర్లు విషయానికి వస్తే.. జియో ఓఎస్, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, 2 జీహెచ్ ఆక్టా కోర్‌ చిప్‌సెట్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమరీ, 11.6 అంగుళాల యాంటీ–గ్లేర్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 4 జీబీ ఎల్‌పీడీడీఆర్‌ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, ఇన్ఫినిటీ కీబోర్డ్, లార్జ్‌ మల్టీ గెస్చర్‌ ట్రాక్‌ప్యాడ్‌తో తయారైంది.

హెచ్‌డీ క్యాలిటీతో వెబ్‌ క్యామ్, స్క్రీన్‌ ఎక్స్‌టెన్షన్,హెచ్‌డీఎంఐ పోర్ట్స్‌, స్టీరియో స్పీకర్స్, వైర్‌లెస్‌ ప్రింటింగ్, ఇంటిగ్రేటెడ్‌ చాట్‌బాట్, ఇన్‌బిల్ట్‌ యూఎస్‌బీ వంటి హంగులు ఉన్నాయి. ఫస్ట్ వెర్షన్ ల్యాప్ టాప్ తో పోలీస్తే దీనిని మరింత సౌకర్యవంతగా తీర్చిదిద్దారు. కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన రిలయన్స్ జియో బుక్ లోని బ్యాటరీ లైఫ్ టైమ్ మెరుగ్గా ఉంటుందంటున్నారు. 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ ఉందని కంపెనీ తెలిపింది. అధునాతన జియోఓఎస్ ఆపరేటింగ్ వ్యవస్థతో ఇది పని చేస్తుంది.ఆగస్ట్‌ 5 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. రిలయన్స్‌ డిజిటల్‌ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ స్టోర్లతో పాటుఈ-కామర్స్  ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ లో అందుబాటులో ఉంచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి