iDreamPost

రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్ధార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు…

రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్ధార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు…

ఆంద్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. గత కోద్ది రోజులుగా వివిద ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిపై వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టి వరుస దాడులు చేస్తున్నారు. తాజాగా రెవెన్యుశాఖ పై దృష్టి సారించారు.14400 టోల్ ఫ్రీ నెంబర్ కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర వ్యప్తంగా ఉన్నతహశీల్ధార్ కార్యాలయాలపై ఈ రోజు దాడులు నిర్వహిస్తున్నారు. పాస్ పుస్తకాల జారీలో జరుగుతున్న అనేక అవకతవకలు, అవినీతిపై వచ్చిన ఫిర్యాదులను పరిగణంలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి అత్యధికంగా ఫిర్యాదులు రావడంతో ఆయా జిల్లాల్లోని తహశీల్ధార్ కార్యాలయాల్లోని రికార్డులు పరిశీలిస్తున్నారు. మూడు నెలల నుంచి జరిగిన కార్యకలాపాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించి ఆరా తీస్తున్నారు.

Read Also: యూ కాంట్ ఎస్కేప్ – ఏసీబీ

అవినీతిని సహించబోమంటూ ప్రమాణ శ్వీకారం రోజునే తేల్చి చెప్పిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి పై ప్రత్యక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పలుమార్లు సమీక్షలు నిర్వహించిన సీఎం జగన్.. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ప్రజలే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. గత నవంబరులో 14400 అనే టోల్ ఫ్రీ నెంబరును ప్రవేశ పెట్టారు. దీనిని సమీక్షించే బాధ్యతను అప్పటి ఏ.సి.బి డిజీ గా ఉన్న కూమార విశ్వజిత్ కు అప్పగించారు. టోల్ ఫ్రీ నెంబరు పని తీరుపై జనవరిలో సమీక్ష నిర్వహించిన జగన్.. ఏసీబీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డిజీగా ఉన్న విశ్వజిత్ ను తప్పించి , ఆ స్థానం లో రవాణా శాఖ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీతారామాంజనేయులను నియమించారు.

Read Also: జగన్ ని అభినంధించిన మహరాష్ట్ర ముఖ్యమంత్రి…

బాధ్యతలు చెప్పట్టిన రోజు నుంచే రాష్ట్రంలో ప్రభుత్వ శాఖాల్లో జరుగుతున్న అవినితి పై సీతారామాంజనేయులు దృష్టి పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై వరుస దాడులు నిర్వహిస్తూ అవినీతి పరుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకొక సబ్ రిజిస్టర్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఈ ఒరవడిని కొనసాగిస్తూ… తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతహశీల్ధార్ కార్యాలయాలపై దృష్టి సారించి ఈ రోజు దాడులు చేశారు. ఈ దాడులతో అవినీతి అధికారులు హడలెత్తి పొతుంటే, రాష్ట్ర ప్రజలు మాత్రం ఏళ్ళుగా ప్రభుత్వ వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి పై జగన్ చేస్తున్న ప్రక్షాళనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి