Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో తాను ఇంత దూకుడుగా ఆడటానికి కారణం తన గురువు యువరాజ్ సింగ్ కాదని, వేరే ప్లేయర్ పేరు చెప్పుకొచ్చాడు సన్ రైజర్స్ యువ సంచలనం అభిషేక్ శర్మ. మరి ఆ ప్లేయర్ ఎవరు?
ఈ ఐపీఎల్ సీజన్ లో తాను ఇంత దూకుడుగా ఆడటానికి కారణం తన గురువు యువరాజ్ సింగ్ కాదని, వేరే ప్లేయర్ పేరు చెప్పుకొచ్చాడు సన్ రైజర్స్ యువ సంచలనం అభిషేక్ శర్మ. మరి ఆ ప్లేయర్ ఎవరు?
Somesekhar
అభిషేక్ శర్మ.. ఈ ఐపీఎల్ లో మారుమోగుతున్న పేరు. మెరుపు బ్యాటింగ్ కు మారుపేరుగా నిలుస్తూ వస్తున్నాడు అభిషేక్. యువరాజ్ శిష్యుడిగా తనదైన బ్యాటింగ్ తో మన్ననలు పొందుతున్న అభిషేక్ శర్మ.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో శివాలెత్తిపోయాడు. హెడ్ తో పాటు అతడు సృష్టించిన విధ్వంసం చూసితీరాల్సిందే. ఇక ఈ సీజన్ లో ఇంత దూకుడుగా ఆడటానికి కారణం అతడే అంటూ తన గురువు యువరాజ్ పేరు చెప్పకుండా మరో ప్లేయర్ చెప్పడం గమనార్హం. అలాగే ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు అభిషేక్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఐపీఎల్ సీజన్ లో సత్తాచాటుతున్న యంగ్ ప్లేయర్లలో ముందువరుసలో ఉన్నాడు అభిషేక్ శర్మ. తన దూకుడైన ఆటతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు తిరుగులేని విజయాలను అందిస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపం చూపించాడు. కేవలం 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సులు 89 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరి వీరవిహారంతో 166 పరుగుల టార్గెట్ ను కేవలం 9.4 ఓవర్లలోనే దంచికొట్టారు. ఇక ఈ సీజన్ లో తన దూకుడుకు కారణం ట్రావిస్ హెడ్ అంటూ చెప్పుకొచ్చాడు.
“నా జీవితంలో నేను ఇంత దూకుడుగా ఆడతానని అస్సలు ఊహించలేదు. ఇంత ఫ్రీడమ్ ఇచ్చి.. ఇలా ఆడేందుకు తోడ్పాటు అందిస్తున్న సన్ రైజర్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఇక నేను ఇలా దూకుడుగా ఆడటానికి కారణం ట్రావిస్ హెడ్. అతడు బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడుతూ.. బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ.. నాపై ఒత్తిడి లేకుండా చేస్తున్నాడు. హెడ్ కారణంగానే నేను స్వేచ్ఛగా, దూకుడుగా బ్యాటింగ్ చేయగలుగుతున్నాను. ఈ సందర్భంగా నాకు బ్యాటింగ్ మెళకువలు నేర్పించిన యువరాజ్ సింగ్, బ్రియన్ లారా, నా చిన్నప్పటి కోచ్ మా నాన్నకు స్పెషల్ థ్యాంక్స్” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అభిషేక్ శర్మ. మరి ఈ సీజన్ లో తన దూకుడుకు ట్రావిస్ హెడ్ కారణం అన్న అభిషేక్ శర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.