iDreamPost

క్రికెట్ చరిత్రలోనే మైండ్ బ్లోయింగ్ క్యాచ్.. వైరల్ అవుతున్న వీడియో!

క్రికెట్ చరిత్రలోనే మైండ్ బ్లోయింగ్ క్యాచ్ నమోదు అయ్యింది. పక్షిలా గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో ఆ ఫీల్డర్ పట్టిన క్యాచ్ చూసి తీరాల్సిందే.

క్రికెట్ చరిత్రలోనే మైండ్ బ్లోయింగ్ క్యాచ్ నమోదు అయ్యింది. పక్షిలా గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో ఆ ఫీల్డర్ పట్టిన క్యాచ్ చూసి తీరాల్సిందే.

క్రికెట్ చరిత్రలోనే మైండ్ బ్లోయింగ్ క్యాచ్.. వైరల్ అవుతున్న వీడియో!

ప్రపంచ క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన క్యాచ్ లు నమోదు అయ్యాయి. అయితే ఒక దానికి మించి మరో క్యాచ్ ప్రపంచ క్రికెట్ లో రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ టీ20 మ్యాచ్ లో ఓ ప్లేయర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ప్రస్తుతం క్రీడా ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. గాల్లోకి అమాంతం ఎగిరి.. ఒంటి చేత్తో పట్టిన ఆ క్యాచ్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ చప్పగా సాగుతోంది. బ్యాటర్ల మెరుపులు లేవు, బౌలర్లు మాత్రం వికెట్ల పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ టోర్నీలో మెరుపు క్యాచ్ లు కూడా నమోదు కావడంలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఓ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ నమోదు అయ్యింది. తాజాగా బెంగాల్ టీ20 లీగ్ లో జరిగిన ఓ మ్యాచ్ లో కళ్లు చెదిరే క్యాచ్ నమోదు అయ్యింది. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ భారీ షాట్ కొట్టాడు. అయితే అందరూ ఆ బాల్ డైరెక్ట్ గా సిక్స్ పడుతుందని అందరూ భావించారు. కానీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ అభిషేక్ దాస్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ను అందుకున్నాడు. స్టాండ్స్ లో పడుతున్న బంతిని అమాంతం పక్షిలా ఎగిరి.. ఒంటి చేత్తో, డైవ్ చేస్తూ.. బంతిని అందుకున్న తీరు చూసి తీరాల్సిందే. ఇక ఈ క్యాచ్ పట్టిన తర్వాత అతడు టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ ట్రేడ్ మార్క్ స్టైల్ ల్లో  తొడ కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి