iDreamPost

ఆరా మస్తాన్ కి ఫోన్లు చేసిన ఆ పార్టీ బడా నేతలు.. కాల్ లిస్ట్‌ రివీల్!

Aaraa Mastan Phone Call List: జూన్ 1 తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఆరా మస్తాన్. వైసీపీ అధికారంలోకి వస్తుందని తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఆరా సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఏదో ఒక వార్త బయటకు వస్తోంది.

Aaraa Mastan Phone Call List: జూన్ 1 తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఆరా మస్తాన్. వైసీపీ అధికారంలోకి వస్తుందని తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఆరా సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఏదో ఒక వార్త బయటకు వస్తోంది.

ఆరా మస్తాన్ కి ఫోన్లు చేసిన ఆ పార్టీ బడా నేతలు.. కాల్ లిస్ట్‌ రివీల్!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోన్న పేరు ఆరా మస్తాన్. కారణంగా..ఆయన చేసే సర్వేలకు ఉండే విశ్వసనీయత. అయితే జూన్ 1న విడుదల చేసిన ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో ఆయన వైఎస్సార్ సీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పారు. దీంతో ఆయనపై కొందరు నెగిటీవ్ కామెంట్స్ చేశారు. అయినా తాను ఇచ్చిన ఎగ్టిట్ పోల్ పై ఆరా మస్తాన్ క్లియర్ ఎనాలసిస్ ఇచ్చారు. ఇది ఇలాంటే తాజాగా ఆయన ఫోన్ కు సంబంధించిన కాల్ లిస్ట్ రివిల్ అయింది. తాజాగా ఆరా మస్తాన్ వలి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూల్లో తన ఫోన్ కాల్ లిస్ట్ ను రివీల్ చేశారు. అందులో బడా బడా నేతల నుంచి మిస్ కాల్స్ ఉన్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

దేశ వ్యాప్తంగా జూన్1వ తేది చివరి విడత లోక్ సభ ఎన్నికలు ముగిసాయి. అనంతరం  అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కాగా.. మిక్ట్స్ టాక్ వచ్చాయి. ఇదే సమయంలో ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికలపై జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలోని పలు సంస్థలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. కొన్ని టీడీపీ కూటమికి అనుకూలంగా చెప్పగా, మరికొన్ని సంస్థలు వైఎస్సార్ సీపీకి అనుకూలంగా చెప్పాయి. చాణక్య ప్రతినిధి పార్ధా దాస్, పోల్ స్ట్రాటజీ, జన్మత్, పోలిటికల్ క్రిటిక్ వంటి సర్వే సంస్థలు వైఎస్ఆర్సీపీకి పూర్తిస్థాయి మెజారిటీని వస్తుందని అంచనా వేశాయి.

Aara Masthan

అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ ఆరా అధినేత ఆరా మస్తాన్ కూడా తన ఎగ్జిట్ పోల్ ను విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలతో మరోసారి అధికారం చెపట్టబోతుందని తెలిపారు. అలాగే టీడీపీ కూటమికి 71 నుంచి 81 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయి. టీడీపీ కూటమికి పురుషుల ఓట్లు 51.56, మహిళల ఓట్లు 54.76 శాతం మేర పడ్డాయని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. ఇది ఇలా ఉంటే.. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీ సీపీ ఎందుకు విజయం సాధిస్తుందనడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. వేర్వేరు యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఎలక్షన్ సర్వే కొనసాగుతున్న సమయంలో పలువురు సీనియర్ నాయకులు తనకు ఫోన్లు చేశారని వివరించారు.ఆ సమయంలో తాను సర్వేల్లో బిజీగా ఉన్నానని తెలిపారు. ఆ మిస్డ్ కాల్స్ జాబితాను ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ చదివి వినిపించారు. అందులో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, బీజేపీ నేత రఘునందన్ రావు, బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి,  పీఆర్కే, బాలినేని రఘురామిరెడ్డి, టీఎన్ఏ నాయుడు, వైసీపీ నేత గులాం రసూల్, బీజేపీ నేత అడపా నరేంద్ర, జనసేన నేత పాపారావు.. వంటి నాయకుల మిస్డ్ కాల్స్ ఆరా మస్తాన్ వలి కాల్ లిస్ట్‌లో ఉన్నాయి. ఇక అదే  ఇంటర్వ్యూలో ఆరా మస్తాన్ మాట్లాడుతూ.. అన్ని పార్టీలతో పోల్చుకంటే తనకు బీజేపీతో సత్సంబంధాలు ఎక్కుగా ఉన్నాయని, ఆ తరువాత బీఆర్ఎస్ తోనే ఉన్నాయని, ఆ రెండిటి తరువాతే వైఎస్సార్ సీపీ, టీడీపీ ఉన్నాయని ఆయన వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి