iDreamPost

రూ.73 కోట్లు లాటరీలో తగిలినా.. ఆమె జీవితమే తలకిందులైంది!

బికారిని కూడా ఒక్కరోజులో కోటీశ్వరుడు లేదా కోటీశ్వరురాలిగా చేసే సత్తా ఒక్క లాటరీకే ఉంది. ఇందులో జాక్ పాట్ తగిలితే చాలు.. కరోడ్ పతి అవ్వడం ఖాయం. ఆమె కూడా ఇదే ఊహించి ఉండి ఉంటుంది. కానీ ఆమె ఆలోచన తల్లకిందులైంది. ఇంతకు ఏం జరిగిందంటే..?

బికారిని కూడా ఒక్కరోజులో కోటీశ్వరుడు లేదా కోటీశ్వరురాలిగా చేసే సత్తా ఒక్క లాటరీకే ఉంది. ఇందులో జాక్ పాట్ తగిలితే చాలు.. కరోడ్ పతి అవ్వడం ఖాయం. ఆమె కూడా ఇదే ఊహించి ఉండి ఉంటుంది. కానీ ఆమె ఆలోచన తల్లకిందులైంది. ఇంతకు ఏం జరిగిందంటే..?

రూ.73 కోట్లు లాటరీలో తగిలినా.. ఆమె జీవితమే తలకిందులైంది!

లాటరీలో జాక్ పాట్ కొడితే.. ఆనందానికి అవధులు ఉండవు. ఒక్క రోజులో జీవితమే మారిపోతుంది. ఆ డబ్బులు ఎలా ఖర్చు చేయాలో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇక ఈ విషయం తెలిసిన వాళ్లైతే.. బంఫర్ డ్రా కొట్టినవాళ్లను నక్క తోక తొక్కొచ్చావ్ అంటారు. నీ అంత లక్కీ ఫెలో లేరని బంధువులు, స్నేహితులు పొగిడేస్తుంటారు. కానీ తాడే పామై కాటేసినట్లు..అదే లాటరీ వల్ల చిక్కులు, ఇబ్బందులు వస్తే.. వాళ్లను ఏమంటారు. ఇదిగో సరిగ్గా ఇదే జరిగింది ఈ వెయిటర్ విషయంలో. అంత డబ్బు వచ్చిందని సంతోష పడలా.. జీవితాంతం వెంటాడుతున్న సమస్యల వల్ల ఏడ్వాలో తెలియక జుట్టు పీక్కున్నంత పని అయ్యింది ఆమెకు. ఇంతకు ఏం జరిగిందంటే..?

1999లో ఫ్లోరిడాలోని అలబామాలోని వాఫిల్ హౌస్ హోటల్‌కి ఎడ్వర్డ్ సెవార్డ్ అనే కస్టమర్ వచ్చాడు. అతను వెళ్లిపోతూ.. టోండా డికర్సన్ అనే మహిళా వెయిటర్‌కు ఓ లాటరీని టిప్‌గా ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన మిగతా సిబ్బంది.. ఈ లాటరీలో డబ్బులు వస్తే అంతా సమానంగా పంచుకోవాలని భావించారు. అనూహ్యంగా ఆ లాటరీకి రూ. 73 కోట్లు వచ్చాయి. అన్ని కోట్లు వచ్చేసరికి ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది డికర్సన్. అనుకున్న దాని ప్రకారం ఆ డబ్బుల్లో తమకు షేరింగ్ వస్తుందని భావించారు.. మిగిలిన వెయిటర్స్. అయితే ఆ డబ్బుల్లో వారికి చిల్ల గవ్వ కూడా ఇచ్చేందుకు ఇష్టపడలేదు డికర్సన్. ఆ మొత్తం తనకే వస్తుందని.. నేనిస్తానన్న మాట నోటి మాటలేనని తేల్చి చెప్పడంతో.. సహాద్యోగులు ఆమెపై కోపంతో కేసు పెట్టారు.

కోర్టు కూడా డికర్సన్‌కు ఫేవర్‌గా తీర్పునిచ్చింది. ఆమెతో చేసుకున్న ఒప్పందం నోటి మానే కానీ.. అధికారికంగా కాదని పేర్కొంది. అలబామా చట్టాల ప్రకారం ఆ కేసును కొట్టివేసింది. అలాగే డికర్సన్ కు వచ్చిన మొత్తాన్ని ఆమె తీసుకోవచ్చునని తీర్పు ఇచ్చింది. అదే సమయంలో ఈ లాటరీ ఇచ్చిన సెవార్డ్‌కు ఈ విషయం తెలిసి.. అతడు కూడా డికర్సన్ పై కేసు పెట్టాడు. అతడి కేసును కూడా కోర్టు కొట్టేసింది. ఇక అన్ని కేసులు తనకు అనుకూలంగా రావడంతో సంతోషంలో మునిగి తేలింది డికర్సన్. అంతలో ఎస్ కార్పొరేషన్ పేరుతో కంపెనీలు పెట్టగా.. పెద్ద మొత్తంలో పన్నులు ఎగొట్టినట్లు ఆరోపణలు రావడంతో.. మళ్లీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. తన కుటుంబానికి రూ. 20 కోట్లు బహుమతిగా ఇచ్చిందన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ ఎదుర్కొంటోంది.

అలాగే ఆమె గెలుచుకున్న డబ్బుల్లో 51 శాతం బహుమతిగా అందించినట్లు ఐటీ శాఖ చెబుతోంది. అయితే అది గిఫ్టు కాదని, తన బాగోగులు చూసుకునేందుకు అప్పగించినట్లు వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమెను 12 ఏళ్ల పాటు టాక్స్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. అలాగే లాటరీలో గెలుచుకున్న సొమ్ములో రూ. 9 కోట్ల వరకు పన్నుల రూపంలో చెల్లించాలని 2012లో కోర్టు ఆమెను ఆదేశించింది. డబ్బులు గెలవడమేమో కానీ.. ఆ నగదును సంపాదించాక.. టెన్షన్లతోనే బతికింది డికర్సన్. సహోద్యోగులతో సమస్యలు, ఇటు ఐటీ రైడ్లు, కోర్టు సమస్యలతో విలవిలలాడింది. అదే మరీ అదృష్టంతో పాటు దురదృష్టం కూడా రావడమంటే. మరీ డికర్సన్ లాంటి స్టోరీ తెలిశాక.. లాటరీ తగలాలని అనుకుంటున్నారా.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి