iDreamPost

కూరగాయల వ్యాపారికి 6 నెలల్లో రూ.21 కోట్లు సంపాదన! పోలీసులే షాక్!

ఓ వ్యక్తి కూరగాయల బిజినెస్ ప్రారంభించి బాగా సంపాదించాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. ఫరీదాబాద్ లో ఓ కూరగాయల దుకాణాన్ని తెరిచాడు. కట్ చేస్తే.. కేవలం 6 నెలల్లోనే రూ.21 కోట్లు సంపాదించాడు. అసలేం జరిగిందో తెలుసా?

ఓ వ్యక్తి కూరగాయల బిజినెస్ ప్రారంభించి బాగా సంపాదించాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. ఫరీదాబాద్ లో ఓ కూరగాయల దుకాణాన్ని తెరిచాడు. కట్ చేస్తే.. కేవలం 6 నెలల్లోనే రూ.21 కోట్లు సంపాదించాడు. అసలేం జరిగిందో తెలుసా?

కూరగాయల వ్యాపారికి 6 నెలల్లో రూ.21 కోట్లు సంపాదన! పోలీసులే షాక్!

అతని పేరు రిషబ్ శర్మ. వయసు 27 ఏళ్లు. కూరగాయల బిజినెస్ ప్రారంభించి బాగా సంపాదించాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. ఫరీదాబాద్ లో ఓ కూరగాయల దుకాణాన్ని తెరిచాడు. అలా కొన్ని రోజుల పాటు ఇతని బిజినెస్ బాగానే నడిచింది. కానీ, కరోనా కారణంగా ఇతని వ్యాపారం పూర్తిగా దెబ్బతిని నష్టాలు వచ్చాయి. దీంతో రిషబ్ శర్మ ఆ దుకాణాన్ని మూసేసి ఆ తర్వాత కొన్ని రోజుల పాటుట ఇంటికే పరిమితమయ్యాడు. ఈ ఖాళీ సమయంలో డబ్బులు సంపాదించేందుకు ఏం చేయాలని బాగా ఆలోచించాడు. ఇతని స్నేహితుడి ద్వారా ఆన్ లైన్ స్కామ్ లతో సైబర్ క్రైమ్ చేయాలని అనుకున్నాడు. ఇక అతని ఫ్రెండ్స్ ద్వారా కొందరి ఫోన్ నెంబర్లు సంపాదించి కాల్స్ చేయడం మొదలు పెట్టాడు.

ఇందులో భాగంగానే.. చిన్న పనికి పెద్ద ఉద్యోగం కల్పిస్తానని అందరినీ నమ్మించాడు. ఇలా చాలా మందిని నమ్మించి వారి నుంచి లక్షల్లో సొమ్మును కాజేశాడు. దీంతో పాటు రిషబ్ డెహ్రుడూన్ కు చెందిన ఓ బడా వ్యాపారికి ఎన్నో మాయ మాటలు చెప్పి అతని వద్ద ఏకంగా రూ.20 లక్షలు దోచేశాడు. ఈ క్రమంలోనే ఓ హోటల్ పేరుతో ఫేక్ వెబ్ సైట్ తో పాటు టెలీగ్రామ్ నూ క్రియేట్ చేశాడు. దీనికి రివ్యూలు రాయాలని కొందరు ఉద్యోగులను నియమించుకుని వారికి నెల నెల జీతాలు కూడా చెల్లించాడు. ఇంతే కాకుండా కొందరు నకిలీ గెస్ట్ లతో ఫేక్ రివ్యూలు ఇప్పించాడు. మొత్తానికి బాధితులతో పాజిటివ్ రివ్యూలు ఇచ్చేలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఇవన్నీ చూసి వివిధ రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది నిజమే అనుకుని రిషబ్ శర్మకు లక్షల్లో డబ్బును పంపించారు.

ఇలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అనేంతగా రివ్యూలు ఇప్పిస్తూ ఏకంగా ఆరు నెలల్లోనే రూ.21 కోట్లు సంపాదించాడు. తీరా తాను అనుకున్న లక్ష్యం నెరవేరడంతో రిషబ్ శర్మ దుకాణం ఎత్తేశాడు. ఫోన్ చేసినా అస్సలు స్పందించలేదు. దీంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నుంచి రిషబ్ పై 10 రాష్ట్రాల్లో దాదాపు 37 కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే రిషబ్ శర్మ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు ఇటీవల అతని అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల విచారణలో మాత్రం ఖంగుతినే నిజాలు బయటపడ్డాయి. రిషబ్ శర్మను అడ్డు పెట్టుకుని చైనా, సింగపూర్ లాంటి వివిధ దేశాల్లో ఉన్న సైబర్ క్రిమినల్స్ ఇతడి ఖాతా నుంచి డబ్బులు దేశాలు దాటించినట్లు దర్యాప్తులో తేలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి