iDreamPost

అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి!

ఆ ఇంటికి అతడే పెద్ద కొడుకు. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు. హాయిగా సాగిపోతున్న జీవితంలోకి మాయదారిలా వచ్చింది..

ఆ ఇంటికి అతడే పెద్ద కొడుకు. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు. హాయిగా సాగిపోతున్న జీవితంలోకి మాయదారిలా వచ్చింది..

అమెరికాలో గుండెపోటుతో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి!

మనిషి జీవన శైలి ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయింది. ఆహారపు అలవాట్లలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వయస్సు బేధం చూడకుండా వస్తున్నాయి. కరోనా తర్వాత ఈ పరిస్థితులు మరింత దిగజారి పోయాయి. ఈ రోజుల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారిని కూడా బలి తీసుకుంటోంది హార్ట్ ఎటాక్. ఆనంద, విషాద సమయాల్లో మనిషి ప్రాణాలను హరించేస్తుంది. గతంలో 60 ఏళ్ల పై బడిన వారికి గుండె పోటు వచ్చేది.కానీ నేడు పసి కందులకు కూడా హార్ట్ స్ట్రోక్ రావడం గమనార్హం. పునీత్ రాజ్ కుమార్, చిరంజీవి సర్జా, తారకరత్న వంటి సెలబ్రిటీలు కూడా దీని బాధితులే. జీవితంపై ఎన్నో ఆశలతో బతుకుతున్న వారిని బలి తీసుకుంటుంది.

మొన్న 7 ఏళ్ల పిల్లాడ్ని, నిన్న పదో తరగతి చదువుతున్న అమ్మాయిని హరించింది హార్ట్ ఎటాక్. తాజాగా మరో యువకుడు గుండె పోటుకు గురయ్యాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న చిట్టోజు మహేష్ అనే యువకుడికి 34 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. హార్ట్ ఎటాక్ కారణంగా బుధవారం ఉదయం మరణించాడు. అతడు తెలంగాణలోని జనగాం జిల్లాలోని బచ్చన్న పేట మండలం వంగ సుదర్శన్ రెడ్డి నగర్ గ్రామ వాసి. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. చిట్టోజు ప్రమీల, మదనాచారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేష్ ఇంజనీరింగ్ చదివి‌ హైదరాబాద్‌లోని నాగారంలో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం అమెరికాలో ఉద్యోగం అక్కడకు వెళ్లాడు. కొడుకు విదేశాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఎంతో మురిసిపోయారు. కానీ ఆ ఆనందం ఎంత కాలం మిగలలేదు.

ప్రస్తుతం జార్జియాలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడుమహేష్. అతడికి భార్య రాధ, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. హాయిగా సాగిపోతున్న జీవితంలోకి మాయదారిలా దాపురించింది గుండె పోటు. యధావిధిగా బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం) ఉద్యోగానికి వెళ్లాడు. డ్యూటీలో ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు గమనించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే గుండె పోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన కుర్రాడు.. ఇలా విగతజీవిగా మారే సరికి కుటుంబ సభ్యులు, తోబుట్టువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అతడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మహేష్ మృతదేహం స్వగ్రామం రావడానికి ఐదు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి