iDreamPost

వీడియో: కాలీ ఫ్లవర్ లో పాము.. షాక్ గురైన మహిళ

వీడియో: కాలీ ఫ్లవర్ లో పాము.. షాక్ గురైన మహిళ

మాములుగా మనం వంట చేయడానికి ముందు కూరగాయాలు శుభ్రం చేసేటప్పుడు కానీ, కట్ చేసేటప్పుడు కానీ అందులో చిన్న చిన్న పురుగులు కనిపిస్తుంటాయి. కానీ ఓ చోట మాత్రం ఏకంగా కాలీ ఫ్లవర్ లో ఓ పాము దర్శనమిచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. ఓ మహిళ కాలీఫ్లవర్ కర్రీ చేయడానికి ముందుగా దాన్ని కట్ చేస్తుండగా అందులో ఓ పాము కనిపించింది. దీనిని చూసి ఆ మహిళ ఒక్కసారిగా షాక్ గురైంది. ఇక ఇదే విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. అతను వచ్చి కాలీ ఫ్లవర్ లో ఏదో పాము ఉన్నట్లు గమనించాడు. ఆ తర్వాత ఆ కాలీ ఫ్లవర్ ను కట్ చేసి అందులో దాగి ఉన్న కట్ల పామును బయటకు తీశాడు.

అనంతరం అతడు ఆ పామును బయటకు వదిలాడు. ఇదంతా వారి కుటుంబ సభ్యులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ షాక్ గురవుతున్నారు. కాలీ ఫ్లవర్ లో పాము ఏంటని అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలీ ఫ్లవర్ లో కట్ల పాము కనిపించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: నాకు భార్యను వెతికి పెట్టండి.. కలెక్టర్ కు యువకుడి వినతి పత్రం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి