iDreamPost
android-app
ios-app

షాకింగ్: మటన్ కర్రీలో కనిపించిన చచ్చిన ఎలుక.. వైరల్ వీడియో!

షాకింగ్: మటన్ కర్రీలో కనిపించిన చచ్చిన ఎలుక.. వైరల్ వీడియో!

మటన్ కర్రీ అంటే కొంతమంది ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుని తింటుంటారు. అచ్చం ఇలాగే ఓ ఫ్యామిలీ ఇటీవల ఓ రెస్టారెంట్ కు వెళ్లి మటన్ కర్రీని ఆర్డర్ చేసింది. కొద్దిసేపటి తర్వాత వెయిటర్ వేడి వేడి మటన్ కర్రీ తెచ్చి వారికి సెర్వ్ చేశాడు. ఈ క్రమంలోనే వాళ్లు తినే ప్రయత్నం చేశారు. దీంతో ఆ కర్రీలో ఓ చచ్చిన ఎలుక కనిపించింది. దీనిని చూసి ఆ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ గురైంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తులు రెస్టారెంట్ వ్యక్తులను ప్రశ్నించారు. ఆ తర్వాత దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పంజాబ్ లోని లుథియానాలో ఇటీవల ఓ ఫ్యామిలీ ఓ ప్రముఖ రెస్టారెంట్ కు వెళ్లింది. భోజనంతో పాటు మటన్ కర్రీ కూడా ఆర్డర్ పెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఆ రెస్టారెంట్ వెయిటర్ వేడి వేడి మటన్ కర్రీ తీసుకొచ్చి వారి ముందు ఉంచాడు. గుమగుమలాడుతున్న ఆ మటన్ కర్రీని వాళ్లంతా లొట్టలేసుకుని తినాలని అనుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ మటన్ కర్రీని వేసుకునే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే.. ఆ కర్రీలో చచ్చిన ఎలుక కనిపించింది. దానిని చూసి ఆ ఫ్యామిలీలో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే ఆ రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి తప్పును కప్పు పుచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ ఫ్యామిలీ ఆ కర్రీని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి