iDreamPost

సక్సెస్ అంటే డబ్బు మాత్రమే కాదు! ఈమె కథని మించిన సక్సెస్ ఉండదు!

Jharkhand Woman Success Story: వైకల్యం తో పాటు ఆర్ధిక కష్టాలు ఎన్ని ఉన్నా ఆత్మస్థైర్యంతో వాటిని ఎదిరించి అందరికీ ఆదర్శంగా నిలిచింది జార్ఖండ్ కి చెందిన ఓ మహిళ.

Jharkhand Woman Success Story: వైకల్యం తో పాటు ఆర్ధిక కష్టాలు ఎన్ని ఉన్నా ఆత్మస్థైర్యంతో వాటిని ఎదిరించి అందరికీ ఆదర్శంగా నిలిచింది జార్ఖండ్ కి చెందిన ఓ మహిళ.

సక్సెస్ అంటే డబ్బు మాత్రమే కాదు! ఈమె కథని మించిన సక్సెస్ ఉండదు!

కఠిక పేదరికం.. దానికి తోడు చెవిటీ,మూగ. తన సహచరులు, చుట్టుపక్కల వాళ్లు అవహేళన ఒకవైపు.. ఆర్ధిక ఇబ్బందులతో తండ్రి వేధింపులు ఒకవైపు, పెద్దయ్యాక తనకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తితో పెళ్లి. కనీసం పెళ్లైన తర్వాత జీవితంలో ఏమైనా మార్పులు వస్తుందని ఆశించింది.. కానీ ఆ ఆశలు కూడా నీరుగారిపోయాయి. చిన్నప్పటి కన్నా పెద్దయ్యాక కష్టాలు మరింత పెరిగిపోయాయి. ఎన్నికష్టాలు వచ్చినా.. మానసికంగా ఇబ్బంది పడ్డా.. ఆమె ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోలేదు. కష్టాలతో పోరాడింది గెలిచింది.. అందరికీ ఇప్పుడు ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు సమాజంలో అందరూ గౌరవించే జార్ఖండ్ కి చెందిన రుక్మిణీ దేవి విజయగాధ గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

జార్ఖండ్ రాష్ట్రం.. గుమ్లా జిల్లాలో ఒక పేద కుటుంబంలో జన్మించింది రుక్మిణి దేవి. చిన్నతనం నుంచి మూగ, చెవుడు ఆమెను ఎంతో బాధించినా.. సహచరులు ఆమెను అవహేళన చేసినా కన్నీళ్లు దిగమింగుతూ బాల్యమం అంతా ఎంతో భారంగా గడిపింది. ఆర్థిక కష్టాలు.. దానికి తోడు నువు దేనికి పనికిరానిదానివి అంటూ తండ్రి ఛీత్కారలు, వేధింపులు. ఇలా రోజులు గడిచిపోయాయి.. రుక్మిణి దేవికి చిన్నతనం నుంచి స్కూల్ అంటే ఏంటో తెలియదు. దినసరి కూలీ పనులు చేస్తూ బతికే తండ్రికి రుక్మిని యుక్త వయసుకి రాగానే భారంగా భావించి ఆమె కన్నా 20 ఏళ్లు పెద్ద వయసు వ్యక్తితో వివాహం జరిపించారు. కనీసం పెళ్లయ్యాక తన జీవితం మారుతుందని భావించింది రుక్మిణి.. కానీ జీవితం మరింత భారంగా మారిపోయింది. నలుగురు పిల్లు పుట్టిన తర్వాత ఆమె భర్త క్షయ వ్యాధితో చనిపోయాడు.

భర్త చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం ఆమెపై పడింది.. అప్పటి నుంచి ఆమెలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. అదే ఆమె సక్సెస్ కి పునాధిబాటలు వేశాయని ది బెటర్ ఇండియా కథనంలో తెలిపారు. నెలవారి వితంతు పెన్షన్ రూ.1000 తో నలుగురు పిల్లలను పోషంచడం చాలా కష్టం అయ్యింది. ఈ క్రమంలోనే గ్రామీణ మహిళల కోసం ఎన్జీవో సంస్థ ‘ప్రధాన్’ 2022లో ఒక వర్క్ షాప్ నిర్వహించింది.. అందులో రుక్మిణి పాల్గొంది. జార్ఖండ్ లో నీటి కొరత ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రవేశ పెట్టింది. అదే సమయంలో మహిళలకు అండగా ‘ప్రధాన్’ సంస్థ నిలిచింది. ఈ క్రమంలోనే రుక్మిణి కొంత భూమి తీసుకొని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా పెసలు, బంగాళ దుంపలు పండించింది. ఆ ఏడాది రూ.4 వేలు ఆదాయం పొందింది. ఆ తర్వాత పశువుల షెడ్డూ, తమకు ఓ చిన్న ఇళ్లు నిర్మించుకుంది. తర్వాత రెండు ఎకరాల్లో భూమి సాగు చేసింది.

తన పొలంలో పెసలు, శనిగలు, బీన్స్, క్యాబేసీ, క్యాలీఫ్లవర్, ఆవాలు, బంగాల దుంపలు ఇలా రక రరాల కూరగాయలు పండిస్తుంది. తన కుటుంబాన్ని పోషించుకుంటుంది.. పిల్లల్ని స్కూల్ కి పంపుతుంది. తల్లిగా తన పిల్లలకు మంచి భవిష్యత్ కోసం కృషి చేస్తుంది. గ్రామంలో ఆమెను చూసి ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాన్ ఎగ్గిక్యూటీమ్ సత్యం శర్మ మాట్లాడుతూ.. పొలాల్లో పైపులు, సౌర శక్తి ఉపయోగించి నీటి పారుదల కు తగిన నీటి సరఫరా చేయడానికి సమీప నదితో అనుసంధానించమాని.. రుక్మిణి కూడా ప్రధాన్ సాయం తీసుకొని ఇప్పుడు మంచి వ్యవసాయం చేస్తుంది. ఆమె సక్సెస్ కి మావంతు సాయం చేశాం అని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి