iDreamPost
android-app
ios-app

164 అడుగుల ఎత్తైన సెల్ టవర్ కొట్టేసిన దొంగలు!

వామ్మో.. ఇటీవల కాలంలో జరుగుతున్న చోరీలు చూస్తుంటే.. ఆందోళన, విస్మయం కలగకమానదు. ఎందుకంటే.. చిన్న చిన్న వస్తువులు కాదూ.. పెద్ద వాటినే.. అందులోనూ అందరూ చూస్తుండగా దొంగలు కాజేస్తున్నారు. తాజాగా అటువంటి ఓ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వామ్మో.. ఇటీవల కాలంలో జరుగుతున్న చోరీలు చూస్తుంటే.. ఆందోళన, విస్మయం కలగకమానదు. ఎందుకంటే.. చిన్న చిన్న వస్తువులు కాదూ.. పెద్ద వాటినే.. అందులోనూ అందరూ చూస్తుండగా దొంగలు కాజేస్తున్నారు. తాజాగా అటువంటి ఓ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

164 అడుగుల ఎత్తైన సెల్ టవర్  కొట్టేసిన దొంగలు!

కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్లు మారిపోయింది దొంగల తీరు. జేబులకు కన్నం వేసి పర్సులు కొట్టేసే వాళ్ల గురించి విన్నాం. ఆఖరికి ఇంటిని లూటీ చేసే దొంగలను చూసుంటాం. కానీ ఇటీవల కొన్ని చోరీలు చూస్తుంటే విస్తుపోవడం ఖాయం. ప్రభుత్వ ఆస్తులకే మంగళం పాడేస్తున్నారు. వాళ్ల కన్ను పడిందంటే చాలు ఎంతటి వస్తువైనా హాం ఫట్ స్వాహా కావాల్సిందే. గత ఏడాది బీహార్‌లో 60 అడుగుల ఐరన్ బ్రిడ్జి రెండు రోజుల్లోనే మాయం చేశారు దొంగలు.   ఐరన్ కాజేందుకు పక్కా ప్లాన్ వేసి.. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారులమని చెప్పి.. ఎంచక్కా దోచేశారు. అంతేనా.. ఇటీవల హైదరాబాద్‌లో రెండు బస్సులు ఎత్తుకెళ్లిన ఘటనలు వెలుగు చూశాయి. కర్ణాటకలో ఏకంగా నిర్మాణంలో ఉన్న బస్టాండునే లేపేశారు. ఇప్పుడు అంతెత్తున ఉండే సెల్ ఫోన్ టవర్లకే ఎసరు పెట్టారు.

ఉత్తరప్రదేశ్‌లో 50 మీటర్ల ఎత్తైన మొబైల్ టవర్ అదృశ్యమైన విచిత్రమైన ఘటన అధికారులను విస్మయానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో కౌశంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో ఉబిద్ ఉల్లా అనే వ్యక్తి పొలంలో దాన్ని ఏర్పాటు చేశారు. అయితే మార్చి 31నే ఆ టవర్ దొంగతనానికి గురైంది. కానీ ఎనిమిది నెలల తర్వాత ఆ టవర్ చోరీకి గురైందంటూ.. దాన్ని ఏర్పాటు చేసిన టెక్నీషియన్ రాజేష్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఐతే ఇక్కడ విస్తుపోయే అంశం ఏంటంటే..? 10 టన్నులు అంటే పదివేల కిలోల బరువు, 50 మీటర్ల పొడవు (సుమారు 164 అడుగులు) ఎత్తైన సెల్ టవర్ ఎలా మాయమైందన్న ప్రశ్న తొలిచేస్తుంది. టవరే కాదూ.. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, షెల్టర్, ఇతర పరికరాలు కూడా ఎత్తుకెళ్లిపోయారు.

ఈ మొత్తం సామాగ్రి విలువ 8.5 లక్షల పైనే ఉంటుందట. టెక్నీషియన్ రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 379 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇటువంటి దొంగతనం జరగడం కొత్తేమీ కాదూ. గతంలోనూ ఇలాంటి సంఘటనలు పలు చోట్ల చోటుచేసుకున్నాయి. బీహార్, మహారాష్ట్ర, బెంగళూరులో సెల్ టవర్స్ చోరీ చేసేశారు దొంగలు. ఇదిలా ఉంటే.. అంత బరువైన, ఎత్తైన టవర్ దొంగిలించాలంటే శ్రమతో కూడుకున్నదీ. మరీ ఆ దొంగతనం ఎలా చేశారో.. ఆ టవర్ విడదీస్తుంటే స్థానికులు ఏమయ్యారో.. అన్న సందేహం కలుగకమానదు. మరీ మీకు ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయా..? ఏమంటారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి