iDreamPost
android-app
ios-app

రోహిత్, కోహ్లీతో పాటు బౌలర్లకే క్రెడిట్.. అతడ్ని ఎందుకు మర్చిపోతున్నారు?

  • Author singhj Published - 06:33 PM, Mon - 30 October 23

వరల్డ్ కప్​లో టీమిండియా వరుస విజయాలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఎక్కువగా క్రెడిట్ ఇస్తున్నారు. విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బౌలర్లకు కూడా మంచి పేరు వస్తోంది. కానీ ఈ క్రమంలో ఒక ప్లేయర్​ను మాత్రం అందరూ మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది.

వరల్డ్ కప్​లో టీమిండియా వరుస విజయాలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఎక్కువగా క్రెడిట్ ఇస్తున్నారు. విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బౌలర్లకు కూడా మంచి పేరు వస్తోంది. కానీ ఈ క్రమంలో ఒక ప్లేయర్​ను మాత్రం అందరూ మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది.

  • Author singhj Published - 06:33 PM, Mon - 30 October 23
రోహిత్, కోహ్లీతో పాటు బౌలర్లకే క్రెడిట్.. అతడ్ని ఎందుకు మర్చిపోతున్నారు?

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్-2023లో భారత్​కు ఎదురే లేకుండా పోయింది. మెగా టోర్నీలో ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చేస్తూ వస్తున్న టీమిండియా.. ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్​నూ మట్టికరిపించింది. లక్నో వేదికగా బట్లర్ సేనతో ఆదివారం జరిగిన మ్యాచ్​లో టీమిండియా 100 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అకౌంట్​లో వేసుకుంది. ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో ఓడిన ఇంగ్లండ్.. భారత్​పై తమ ప్రతాపం చూపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇంగ్లీష్ టీమ్ మాత్రం ఏ విభాగంలోనూ రోహిత్ సేన ముందు నిలబడలేకపోయింది. మ్యాచ్​లో ఏ దశలోనూ ఇంగ్లండ్ గెలుస్తుందనిపించలేదు.

ఇంగ్లండ్​పై విజయంతో వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్​లో భారత్ మొత్తం 12 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్​కు చేరుకుంది. తద్వారా ఈసారి మెగా టోర్నీలో సెమీస్​కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అయితే భారత్ వరుస విజయాలకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు బౌలర్లకే ఎక్కువ క్రెడిట్ దక్కుతోంది. రోహిత్ బ్యాటుతో రాణించడమే గాక కెప్టెన్​గా సరైన నిర్ణయాలు తీసుకుంటూ టీమ్​ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. కోహ్లీ విన్నింగ్ నాక్స్ ఆడుతూ టీమ్​కు ఎదురే లేకుండా చేస్తున్నాడు. బౌలర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇందులో ఒక ప్లేయర్​కు మాత్రం కాస్త అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ వాపోతున్నారు.

టీమిండియా వరుస విజయాలకు కారకుల్లో వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఒకడు. భారత్ ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగింట్లో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో 2 రన్స్​కు 3 వికెట్లు పడిన టైమ్​లో క్రీజులోకి వచ్చాడు. విరాట్ కోహ్లీతో కలసి 165 రన్స్ పార్ట్​నర్​షిప్ నెలకొల్పాడు. ఆ మ్యాచ్​లో 97 రన్స్ చేసిన రాహుల్ కొంచెంలో సెంచరీ మిస్సయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో కోహ్లీతో కలసి 83 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కివీస్​తో మ్యాచ్​లోనూ విరాట్​తో కలసి 54 పరుగులు జోడించాడు. ఆదివారం ఇంగ్లండ్​తో పోరులోనూ కెప్టెన్ రోహిత్​తో కలసి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి వికెట్లను కాపాడుతూనే.. స్కోరు బోర్డుపై ఒక్కో రన్ చేర్చుతూ టీమ్ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు కేఎల్ రాహుల్. అలాగే కీపింగ్​లోనూ అద్భుతంగా డైవ్​లు చేస్తూ క్యాచులు పడుతున్నాడు. ఆరు మ్యాచుల్లో రెండుసార్లు అతడు బెస్ట్ ఫీల్డర్ మెడల్స్ గెలుచుకున్నాడు. కెప్టెన్ రోహిత్​కు ఫీల్డ్ ప్లేస్​మెంట్స్, బౌలింగ్ ఛేంజెస్​లో సలహాలు ఇస్తున్నాడు. భారత్ గెలుపులో ఇంత కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రాహుల్​కు మాత్రం క్రెడిట్ ఇచ్చినట్లు కనిపించడం లేదు. 2011 వరల్డ్ కప్​లో ఇలాగే టీమిండియాను గెలిపించిన గంభీర్​కు అంతగా పేరు రాలేదు. దీంతో గంభీర్​లాగే ఈసారి అన్​సంగ్​ హీరోగా రాహుల్ మిగిలిపోతాడేమోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరి.. సక్సెస్ క్రెడిట్​లో రాహుల్​ను మర్చిపోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బౌలింగ్​లో రెచ్చిపోతున్న టీమిండియా.. భారత బౌలర్ల సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet