iDreamPost
android-app
ios-app

ఫేస్ బుక్ లో పరిచయం…34 ఏళ్ల మహిళతో 80 ఏళ్ల వృద్దుడి ప్రేమ వివాహం!

ప్రేమకు వయసు, ఆస్తులు, అంతస్తులు కులం, మతం వంటివి అడ్డు కాదు. అందుకనే ప్రేమ గుడ్డిది అని అంటారు. అయితే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ప్రేమ పెళ్లి చూస్తే అంతకు మించి అని అనక మానరు.

ప్రేమకు వయసు, ఆస్తులు, అంతస్తులు కులం, మతం వంటివి అడ్డు కాదు. అందుకనే ప్రేమ గుడ్డిది అని అంటారు. అయితే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ప్రేమ పెళ్లి చూస్తే అంతకు మించి అని అనక మానరు.

ఫేస్ బుక్ లో పరిచయం…34 ఏళ్ల మహిళతో 80 ఏళ్ల వృద్దుడి ప్రేమ వివాహం!

ప్రేమ అనేది రెండు అక్షరాల పదమే కావచ్చు. కానీ దీనికి ఉండే శక్తి గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇలానే ఈ ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పలేము. ప్రేమకు వయసు, ఆస్తులు, అంతస్తులు, కులం, మతం, రంగు వంటివి ఏమీ చూసుకోదు. అందుకనే ప్రేమ గుడ్డిదని కొందరు అంటారు. అయితే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ప్రేమ పెళ్లి గురించి మాట్లాడితే.. ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు అంతకు మించి అని అంటున్నారు.. ఎందుకంటే వధువుకు 32 ఏళ్ళు.. వరుడికి 80 ఏళ్ళు.. దీంతో ప్రేమ మరీ ఇంత గుడ్డిదా అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విచిత్ర పెళ్లి మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్  రాష్ట్రంలోని అగర్ మాల్వా జిల్లాలో  మగారియా గ్రామంలో బలురామ్ బగ్రీ(80) అనే వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. అలానే అమరావతి ప్రాంతానికి చెందిన షీలా ఇంగ్లే(34) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. బగ్రీకి, షీలా ఇద్దరూ సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించేవారు. అలా ఓ సారి ఫేస్ బుక్ ద్వారా వీరిద్దరకి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి తరచూ మెసేజ్ లు చేసుకుంటూ కాలం గడిపేవారు. అలా ఫేస్ బుక్ తో ఏర్పడిన పరిచయం మంచి స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్తా కొన్ని రోజులకు ప్రేమగా మారింది. అలా షీలా, బగ్రీ ఇద్దరూ చాలా కాలం  పాటు ప్రేమలో మునిగి తేలారు. ఇక ఒకరి వదలి మరొకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు.

వారి ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పారు. చివరకు  ఓ న్యాయవాదిని ఆశ్రయించిన ఈ జంట.. తమ  ప్రేమను గెలిపించుకున్నారు. న్యాయవాది ద్వారా ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆవరణలో ఉన్న హనుమాన్ మందిరంలో బగ్రీ, షీలా తమ సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడ అందరి సమక్షంలో షీలా మెడలో బగ్రీ తాళి కట్టారు. అనంతరం ఇరువురు దండలు మార్చుకుని ఒకటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వీరి పెళ్లిని కొందరు సమర్ధించగా, మరికొందరు ఇదేమి ప్రేమరా నాయన అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన ప్రేమకథ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ జంట వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది. మరి.. ఈ విచిత్రమైన పెళ్లి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetMeritkingTimebetGrandpashabetGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMadridbetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş