iDreamPost

భారత్ లో ఎక్కువ జీతాలు తెచ్చిపెట్టే 7 ఉద్యోగాలు ఇవే!! 

భారత్ లో ఎక్కువ జీతాలు తెచ్చిపెట్టే 7 ఉద్యోగాలు ఇవే!! 

ఇప్పుడు కాలంతో పాటు ఉద్యోగాల శైలి కూడా మారింది. ఒకప్పుడు నెలకు 30 వేలు వస్తే చాలనుకునే పరిస్థితి నుంచి కనీసం 6 లక్షల ప్యాకీజీ లేకపోతే ఎలా? అనే స్థాయికి వచ్చింది. వీటితో పాటుగా ఆధునిక కాలంలో కొత్త కొలువులు సైతం వచ్చి చేరుతున్నాయి. ప్రస్తతం భారత్ లో ఈ 7 ఉద్యోగాలకు లక్షల్లో జీతాలు వస్తున్నాయి. అవేంటో చూసేద్దాం రండి.

 

  1. సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్:

కంప్యూటర్ రాకతో మొత్తం ప్రపంచమే మారిపోయింది. అలా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ ఉద్యోగాల్లో లక్షల జీతాలు పొందేందుకు అవకాశం ఉండటంతో అనేకమంది యువత, విద్యార్థులు ఈ రంగం పైవుగా వస్తున్నారు. ప్రారంభంలో 3-7 లక్షల వార్షిక ఆదాయాన్ని పొందుతూ ఉండగా.. వృత్తి అనుభవం, ప్రతిభతో ఆకాశమే హద్దుగా అదాయాన్ని పొందుతున్నారు.

 

  1. కమర్షియల్ పైలట్:

ఏవియేషన్ రంగంలో కెరీర్ ను వృద్ధి చేసుకోవాలని అనుకునే వారికి గొప్ప ఎంపిక అవుతంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ప్రయాణించడం ఇందులో మరొక బోనస్. అయితే కమర్షియల్ పైలట్ కావాలనుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.

కెరీర్ ప్రారంభ దశలో 15లక్షల వార్షిక ఆదాయం ఉంటుంది. వృత్తి అనుభవం వచ్చాక దాదాపు 50లక్షల వరకు వార్షిక వేతనాలు ఉంటాయి.

 

  1. డేటా సైంటిస్ట్:

నేటి ప్రపంచంలో అన్నటికంటే గొప్ప ఆయుధం డేటా. ఈ ఒక్క కారణంతోనే ఇటీవలి కాలంలో డేటా సైన్స్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. బిగ్ డేటా ద్వారా సమాచారాన్ని అందుకోవడం ప్రారంభమైన దశలో ఈ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. డేటా సైంటిస్ట్ గా సర్టిఫికేషన్ చేసిన వారు 4-12 లక్షల వార్షిక ఆదాయం పొందుతూ ఉండగా, వృత్తి అనుభవాన్ని పొందిన సీనియర్లకు దాదాపు 70 లక్షల వార్షిక వేతనం దక్కుతుంది.

 

  1. బ్లాక్ చెయిన్ డెవలపర్:

బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో వచ్చిన పెనుమార్పులు కొత్త ఉద్యోగాల కల్పనకు దోహదపడ్డాయి. డిజిటల్ కరెన్సీ-క్రిప్టో కరెన్సీ వంటి కొత్త అంశాల వల్ల నూతన ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఈ ఉద్యోగుల సగటు వార్షిక ఆదాయం 8 లక్షలు ఉండగా, అనుభవం గడించిన వారికి 45లక్షల వరకు వార్షిక జీతాలు ఇస్తున్నాయి సంస్థలు.

 

  1. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్:

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జీతాలు గడిస్తున్న వృత్తి ఇది. ఒక క్లైంట్ కు సరైన పెట్టుబడి ఎలా పెట్టాలి? డబ్బును తెలివిగా, వేగంగా ఎలా సంపాదించాలి అనే అంశాలను అందిస్తారు ఉద్యోగులు. ఈ వృత్తిలో 4-40 లక్షల వరకు వార్షిక వేతానాన్ని పొందేందుకు అవకాశం ఉంది. అనుభవంతో పాటు జీతం కూడా అంతే త్వరగా పెరుగుతుంది.

 

  1. ప్రోడక్ట్ మేనేజర్:

సాఫ్ట్ వేర్ లో ఒక ప్రొడక్ట్ ఆలోచన మొదలు, అది వివిధ దశలు దాటి బయటకు వచ్చేవరకు దాన్ని సమర్థవంతంగా నిర్వహించేవారికి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. మేనేజ్మెంట్ స్కిల్స్ తెలిసిన వారు మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఎక్కువ. ప్రారంభంలో 10 లక్షల వార్షిక వేతనం వస్తుంది. అనుభవంతో పాటు సగటున 17లక్షలు వార్షిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. కెరీర్ లో అభివృద్ధి సాధించే కొద్దీ, జీతం కూడా అంతే తీరులో పెరుగుతుంది.

 

  1. వైద్య నిపుణులు:

ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. అరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందుకే వైద్య నిపుణులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. సర్జన్లు. ఫార్మసిస్టులు, హెల్త్ కేర్ నిపుణులు అంటూ వీటిలో అనేక విభాగాలు ఉన్నాయి. ఈ వృత్తిలో 6లక్షల నుంచి 20 లక్షల వరకు ఆదాయం ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి