iDreamPost
android-app
ios-app

తాపీ మేస్త్రీని వరించిన అదృష్టం.. లాటరీలో ఏకంగా 360 కోట్లు!

తాపీ మేస్త్రీని అదృష్టం వరించింది. లాటరీలో ఏకంగా 360 కోట్లు గెలుచుకున్నాడు. నెలకు కోటి చొప్పున 30 ఏళ్లపాటు డబ్బును అందుకోనున్నడు. ఆ వ్యక్తి లాటరీలో వందల కోట్లు గెలుచుకోవడంతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

తాపీ మేస్త్రీని అదృష్టం వరించింది. లాటరీలో ఏకంగా 360 కోట్లు గెలుచుకున్నాడు. నెలకు కోటి చొప్పున 30 ఏళ్లపాటు డబ్బును అందుకోనున్నడు. ఆ వ్యక్తి లాటరీలో వందల కోట్లు గెలుచుకోవడంతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

తాపీ మేస్త్రీని వరించిన అదృష్టం.. లాటరీలో ఏకంగా 360 కోట్లు!

అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేము. అప్పటి వరకు పేదరికంలో మగ్గిన వారు ఉన్నట్టుండి కోటీశ్వరులుగా మారుతారు. వారి జీవితాల్లో ఒక్కసారిగా పెనుమార్పులు చోటుచేసుకుంటుంటాయి. అయితే ఈ లక్ అనేది రెక్కాడితే గాని డొక్కాడని వాళ్లకు వరిస్తే వారి ఆనందానికి హద్దే ఉండదు. ఇది వరకు లాటరీ టికెట్లు కొని చాలా మంది డ్రైవర్లు, కూలీలు, ఇతర చేతి వృత్తుల వారు కోట్ల రూపాయలు గెలుచుకుని జాక్ పాట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ తాపీ మేస్త్రీ లాటరీ టికెట్ కొని ఏకంగా 360 కోట్లకు అధిపతయ్యాడు. తాపీ మేస్త్రీ పనికి మహా అయితే రోజుకు ఓ వెయ్యి రూపాయలు కూలీ ఉంటుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి లాటరీలో వందల కోట్లు గెలుచుకోవడంతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

బ్రిటన్‌ లోని ట్రోబ్రిడ్జ్కు చెందిన 52 ఏళ్ల జాన్ స్ట్రెంబ్రిడ్జ్ గత సంవత్సరం నేషనల్ లాటరీస్ సెట్ ఫర్ లైఫ్ నుండి లాటరీ టికెట్ కొనుగోలు చేసాడు. అయితే ఆ లాటరీ టికెట్ ఆయన జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేకపోయాడు.జాన్ గత సంవత్సరం మే 18న లాటరీ టికెట్ కొన్నాడు. ఆ తర్వాత ఆ టికెట్ విషయాన్ని మర్చిపోయాడు. కొంత కాలం తర్వాత ఆ లాటరీ కొన్న విషయం గుర్తొచ్చింది. వెంటనే ఆ టికెట్ కొన్న దగ్గరికి వెళ్లి చెక్ చేయించాడు. ఆ సమయంలో ఆ టికెట్ గెలిచిన టికెట్ గా తేలిపోయింది.

దీంతో అతడు సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఎంతో కొంత డబ్బు వస్తుందని అనుకున్నాడు కానీ కోట్లు తెచ్చిపెడుతుందని అనుకోలేదు జాన్. ఏకంగా నెలకు కోటి రూపాయల చొప్పున 30ఏళ్ల పాటు డబ్బులు పొందనున్నట్టు తెలుసుకున్నాడు. అంటే మొత్తం 360 కోట్లనుతెచ్చిపెట్టింది లాటరీ టికెట్. తాపీ మేస్త్రీ లాటరీ టికెట్ ద్వారా జాక్ పాట్ కొట్టడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. లాటరీలో అదృష్టం వరించిన జాన్ నా కుటుంబం కోసం ప్లాస్టర్ ధూళితో ఇంటికి తిరిగి వచ్చే రోజులు పోయాయి. వారి జీవితాల్లో కష్టాలు తొలిగిపోయి సుఖ సంతోషాలు వెల్లువిరియనున్నాయని తెలిపాడు. ప్రతి నెల కోటి రూపాయలు పొందడం అంటే అసాధారణమైనదని జాన్ వెల్లడించాడు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş