iDreamPost

లక్షల్లో వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఆ జాగ్రత్త తీసుకోకపోతే మీ అకౌంట్ కూడా..!

లక్షల్లో వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఆ జాగ్రత్త తీసుకోకపోతే మీ అకౌంట్ కూడా..!

మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. మెసేజ్ లు, కాల్స్ కోసం మాత్రమే కాకుండా.. తాజాగా వచ్చిన ఫీచర్స్ తో అప్ డేట్స్ కూడా వాట్సాప్ లోనే తెలుసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. వాట్సాప్ సంస్థ భారతదేశంలో ఉన్న తమ యూజర్లకు గట్టి షాకిచ్చింది. ఒక్క నెలలో ఏకంగా 74 లక్షల వాట్సాప్ ఖతాలను బ్యాన్ చేసింది. అయితే ఫిర్యాదులు వచ్చిన అకౌంట్స్ మాత్రమే కాకుండా ఫిర్యాదులు రాని ఖాతాలను కూడా ముందస్తు చర్యల్లో భాగంగా బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

వాట్సాప్ సంస్థను అందరూ విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఏదైనా మితంగా వాడితేనే మంచిగా ఉంటుంది. శ్రుతి మించితే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందరూ వాట్సాప్ ని వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే వాడుకుంటే ఏ గోల ఉండదు. కానీ, ఇష్టమొచ్చినట్లు వాడితో చివరికి ఖాతా బ్యాన్ అవుతుంది. ఇప్పుడు వాట్సాప్ సంస్థ కూడా అదే చేస్తోంది. దేశంలోని ఐటీ నిబంధనలు అనుగుణంగా ఫిర్యాదులు అందిన ఖాతాలను వాట్సాప్ సంస్థ బ్యాన్ చేస్తోంది. ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 74 లక్షల 20 వేల 748 ఖాతాలను బ్యాన్ చేసింది. వాటిలో 35 లక్షలకు పైగా ఖాతాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండానే ముందస్తు చర్యల్లో భాగంగా బ్యాన్ చేసింది. అంటే మీ ఖాతాకు సంబంధించి ఇంకొకరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. వారికి ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా బ్యాన్ చేసేస్తారు.

ఇన్ని లక్షల్లో అకౌంట్లు బ్యాన్ చేయడం ఇదే మొదటిసారి కాదు. జూన్ 1 నుంచి 30వ తేదీ మధ్య 66 లక్షల 11 వేల 700 అకౌంట్లను బ్యాన్ చేసింది. వాటిలో 24 లక్షలకు పైగా అకౌంట్లకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. వారి వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే అనుమానంతో ముందే బ్యాన్ చేశారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్ సంస్థ అకౌంట్లను బ్యాన్ చేస్తుంది. అయితే బ్యాన్ అయిన అంకౌట్లకు సంబంధించి అప్పీల్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ ఏడాది గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తీసుకున్న నిర్ణయాలపై యూజర్లకు అప్పీల్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. అయితే అసలు అకౌంట్స్ ఎందుకు బ్యాన్ అవుతున్నాయో చాలా మందికి తెలియకపోవచ్చు.

యూజర్ సేఫ్టీ, వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్ సంస్థ ఈ బ్యాన్ లను విధిస్తోంది. అయితే మీ ఖాతా ఇలా బ్యాన్ కాకుండా ఉండాలి అంటే.. మీకు వచ్చిన ప్రతి మెసేజ్ ని ఊరికే ఫార్వార్డ్ లు చేయకండి. ఎవరి మీద కూడా హేట్ స్పీచ్ ని సర్క్యూలేట్ చేయద్దు. ఇంకొకరి మనోభావాలు దెప్పతినే మెసేజ్ లు, ఫార్వార్డ్ సందేశాలు పంపకండి. ఇలాంటి చర్యల వల్ల మీ ఖాతాపై ఫిర్యాదులు అందితే కచ్చితంగా బ్యాన్ అవుతుంది. అలాగే సెన్సిటివ్ కంటెంట్, హేట్ స్పీచ్, వరల్గర్ ల్యాగ్వేజ్ ని వాడుతున్నా, ఎక్కువగా ఫార్వార్డ్ చేస్తున్నా కూడా మీ ఖాతాను బ్యాన్ చేసేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి.. లక్షల్లో వాట్సాప్ ఖాతాలు బ్యాన్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి