iDreamPost

ఇది మోడీ గ్యారెంటీ! మెడిసిన్‌ ధరల పెంపుపై కేంద్ర మంత్రి క్లారిటీ

  • Published Apr 05, 2024 | 4:10 PMUpdated Apr 05, 2024 | 4:10 PM

Medicine Prices: గత కొన్ని రోజులుగా నిత్యవసర మందుల పై ధరలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తాజాాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సామాన్య ప్రజలకు కొంత మేరకు ఊరట లభించింది.

Medicine Prices: గత కొన్ని రోజులుగా నిత్యవసర మందుల పై ధరలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తాజాాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సామాన్య ప్రజలకు కొంత మేరకు ఊరట లభించింది.

  • Published Apr 05, 2024 | 4:10 PMUpdated Apr 05, 2024 | 4:10 PM
ఇది మోడీ గ్యారెంటీ! మెడిసిన్‌ ధరల పెంపుపై కేంద్ర మంత్రి క్లారిటీ

ఈ మధ్యకాలంలో సామాన్య ప్రజలకు ప్రతి విషయంలో ఆందోళనకరంగా ఉంటుంది. ఎందుకంటే.. దేశంలో నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వస్తువుల వరకు అన్నీ ఇలా ధరలు భారీగా పెరుగిపోతున్నాయి. దీంతో మధ్యతరగతి ఇళ్లలో అవసరాలతో పాటు , ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే.. సామాన్య ప్రజలకు ఇటీవల కాలంలో ఓ బిగ్ షాక్ తగిలింది. కాగా, ఈ ఏప్రిల్ నెల 1 నుంచి మందుల ధరలు పెంచుతున్నట్లు వార్తలు జోరుగా వినిపించ సాగాయి. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా మందుల ధరలను పెంచుతున్నట్లు సమాచారం అందింది. ఇక ఈ వార్తలు కాస్త వైరల్ గా మారడంతో ఇకపై మధ్య తరగతి కుటుంబాలు నిత్యవసర మందుల ధరలు పెరగితే ఎలా కొనేది అంటూ వాపోయారు. కానీ, ఈ వార్తల పై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ శుభవార్తను తెలియజేసింది. ఇక కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సామాన్య ప్రజలకు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొన్ని రోజులుగా నిత్యవసర మందుల పై ధరలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అంతేకాకుండా.. ప్రస్తుతం నిత్యావసర మందుల ధరలను పెంచేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా.. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అలాగే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగిన దృష్ట్యా 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర ఔషధాల ధరలను పెంచబోమని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడమే కాకుండా.. ఇది ‘మోడీ జీ హామీ’ అని చెప్పారు. అంతేకాకుండా.. మందుల ధరలు పెంచే విషయంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. అలాగే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) ఏటా టోకు ధరల సూచిక (డబ్ల్యుపిఐ) ఆధారంగా షెడ్యూల్ చేసిన మందుల గరిష్ట ధరలను సవరిస్తుంది అని మంత్రి చెప్పారు.

దీంతో పాటు NPPA కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ శాఖ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కింద పనిచేస్తుంది. ఎన్‌పిపిఎ పర్యవేక్షించి అవసరమైన మందుల ధరలను డబ్ల్యుపిఐ ఆధారంగా నిర్ణయిస్తుందని మాండవ్య చెప్పారు. పైగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయని, తగ్గినప్పుడు ధరలు తగ్గుతాయని చెప్పారు. అయితే ఈ ఏడాది మాత్రం ద్రవ్యోల్బణం పెరగలేదని మాండవ్య అన్నారు. ఇది కేవలం 0.005. అందువల్ల కంపెనీలు ఈ ఏడాది ధరలను పెంచవని కూడా స్పష్టం చేశారు.

ఇక డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO) 2013 నిబంధనల ప్రకారం.. మందులు షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ ఫార్ములేషన్‌లుగా వర్గీకరించబడతాయి. అందువల్ల నాన్-షెడ్యూల్డ్ ఫార్ములేషన్ల విషయంలో.. తయారీదారు ధరను నిర్ణయించే స్వేచ్ఛ ఉందని మంత్రి చెప్పారు. కనుక ఈ ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర మందుల ధరలు పెరగే ఆవకాశం ఉండదని స్పష్టత వచ్చేసింది. మరి, ఈ ఏడాది నిత్యవసర మందులు ధరలు పెరగబోవని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి